బగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

బగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

బగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి ఆంజనేయస్వామికి లక్ష మల్లె పూల అర్చన నగరంపాలెం: గుంటూరు నగరం మారుతీనగర్‌లోని కంచి కామకోటి పీఠ మారుతి దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హనుమ జ్జయంతి మహోత్సవాలు బుధవారం రెండో రోజుకి చేరాయి. ఉదయం ఆంజనేయస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి లక్ష మల్లె పూల అర్చన చేపట్టారు. సాయంత్రం వేణు గోపాల భక్తి భజన సమాజం (పెదపరిమి, ఖాజీపాలెం) గోపాల్‌ ఆధ్వర్యంలో భక్తి సంకీర్తన జరగ్గా, అలరించింది. అనంతరం హారతులు సమర్పించి దర్బార్‌ సేవ నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు కొరపాటి రామారావు దంపతులు, కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. విజయకీలాద్రిని దర్శించిన ఆస్ట్రేలియన్‌ కౌన్సిల్‌ జనరల్‌ మల్లేశ్వరుడి సేవలో కేంద్రమంత్రి పెమ్మసాని

చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారిని బుధవారం ఏపీ హైకోర్టు న్యాయూమూర్తి జస్టిస్‌ ఉమామహేశ్వరరావు దంపతులు, ఏలూరు రిటైర్డ్‌ ఎస్పీ డీవీఎస్‌ మూర్తి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మేనేజర్‌ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయం చుట్టూ వారు ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో జరిగిన పూర్ణాహుతి పూజా కార్యక్రమాలలో న్యాయమూర్తి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులకు, ఎస్పీ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసి ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో పిట్టలవానిపాలెం తహసీల్దార్‌ డి.వెంకటేశ్వరరావు, బాపట్ల రూరల్‌ సీఐ హరికృష్ణ, ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని ఆస్ట్రేలియన్‌ కౌన్సిల్‌ జనరల్‌ హెచ్‌.ఇ.సిలాయ్‌జాకీ, ఆస్ట్రేలియన్‌ హై కమిషనర్‌ హెచ్‌.ఇ.ఫిలిప్‌లు బుధవారం సందర్శించారు. వారు విజయకీలాద్రిపై ఉన్న అన్ని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 27 అడుగుల ఏకశిలా విగ్రహం విఘ్న విమోచక హనుమాన్‌ను దర్శించుకున్నారు. అనంతరం వారికి చిత్రపటాన్ని, స్వామి వారి శేషవస్త్రాన్ని నిర్వాహకులు బహూకరించారు. ఆలయ విశిష్టతను జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు వివరించారు.

పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని కేంద్ర కమ్యూనికేషన్స్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి అర్చకస్వాములు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు, ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్‌ అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement