జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: జిల్లాలో జన గణనను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులు సమన్వయంతో పనిచేయా లని పేర్కొన్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం ఇళ్ల వద్ద అందుబాటులో ఉంటారని గమనించాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్యుమరేటర్లు రెండు పూటలా గృహ సందర్శన చేయడం మంచిదన్నారు.
జలధార – జల హారతి పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ మాట్లాడుతూ మంజూరైన జలధార–జల హారతి పనులు పూర్తి చేయాలన్నారు. మంజూరు చేసిన పనులలో ఇంకా ప్రారంభం చేయడంలో జాప్యం జరుగుతుండటం పట్ల చేబ్రోలు, కాకుమాను, పొన్నూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ప్రశ్నించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పనులను పూర్తి చేయడంలో చురుకై న పాత్ర పోషించాలన్నారు. పనుల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. పూర్తి సామర్థ్యంలో చెరువులలో నీటి నిలువ చేయాలని పేర్కొన్నారు. చెరువు గర్భం మాత్రమే కాకుండా కాలువలు, స్లూయిస్ లలో గురప్రు డెక్క ఉండరాదని, పూడికలు లేకుండా చూడాలని అన్నారు. యంత్ర పరికరాల వినియోగం అవసరం ఉన్న పనులను గుర్తించి, జాబితాను రూపొందించాలన్నారు. డివిజనల్ అభివృద్ధి అధికారులు జలధార పనులను పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐ ద్వారా వృత్తి నైపుణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంతో వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏఐపై జిల్లా అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ స్వయంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏఐలో పొందుపరచకూడని అంశాలను కూడా వివరించారు.


