ఉద్యోగం పేరుతో పది లక్షలు కాజేశాడు.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పేరుతో పది లక్షలు కాజేశాడు..

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

నగరంపాలెం: రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని లోకో పైలెట్‌ మోసగించాడని, అతడికి చెల్లించిన రూ.10.5 లక్షలు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నట్లు ఓ నిరుద్యోగి వాపోయారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌(గ్రీవెన్స్‌)లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుల వినతులను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్వీకరించారు. ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఫిర్యాదు చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన)రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి(మహిళా పీఎస్‌), బెల్లం శ్రీనివాస్‌(ట్రాఫిక్‌), మధుసూదన్‌రావు (గుంటూరు సీసీఎస్‌) అర్జీలు స్వీకరించారు.

జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌లో బాధితుడి ఆవేదన

Advertisement
 
Advertisement
Advertisement