చేబ్రోలు: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ అతివేగంగా ఢీ కొట్టడంతో రైతు దుర్మరణం చెందిన ఘటన మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లేమల్లెపాడుకు చెందిన వల్లపు రఘురామయ్య(48) కొత్తరెడ్డిపాలెంలో పొలం పనులు ముగించుకొని టీవీఎస్‌పై ఇంటికి బయలు దేరాడు. పాతరెడ్డిపాలెం గ్రామ శివారులో లేమల్లెపాడు వెళ్లే దారిలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రఘురామయ్యకు ముఖానికి, తలకు, కాళ్లు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. బిహార్ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పేద కుటుంబానికి చెందిన రఘురామయ్య మృతికి కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేబ్రోలు ఎస్‌ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


