అంతర్‌ జిల్లాల బాస్కెట్‌ బాల్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లాల బాస్కెట్‌ బాల్‌ జట్టు ఎంపిక

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: బాస్కెట్‌ బాల్‌ అంతర్‌జిల్లాల సబ్‌జూనియర్‌ బాల, బాలికల జట్ల ఎంపిక ప్రక్రియ సోమవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఎంపిక ప్రక్రియను ఏపీ స్టేట్‌ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పాటిబండ్ల విష్ణువర్ధన్‌, చీఫ్‌ సెలెక్టర్‌ గుంటుపల్లి హరగోపాల్‌ సమక్షంలో శిక్షకులు కోరగంటి రవి, చావల శ్రీను, సురేష్‌, అనిల్‌ సూర్య నిర్వహించారు. అంతర్‌ జిల్లాల సబ్‌–జూనియర్‌ బాల, బాలికల బాస్కెట్‌ బాల్‌ చాంపియన్‌న్‌షిప్‌కు గుంటూరు జిల్లా జట్టు తరుఫున బాలుర విభాగం నుంచి లోహిత్‌ కుమార్‌, నిమేష్‌ రెడ్డి, అథర్వ్‌, లోహిత్‌, ప్రీతం పాల్‌, శశాంక్‌, తనీష్‌, ఇషాంత్‌, మోక్షిత్‌, సాయి శివ నాగ్‌, కార్తికేయ, నాగార్జున, అలీ, షాజాద్‌, బోడేశ్వర్‌, ధ్రువేష్‌ చౌదరి ఎంపికయ్యారు. బాలికల విభాగం నుంచి భూమి, మహిత, దీప్తి, దీక్షిత, పార్నవి, బృంద సాయి, సాన్విత, వేధన్షి, పల్లవి, రాగ వర్షిణి, తన్వి, కావ్య, యాషిక, లీష్మ లను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు చిత్తూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement