భద్రత తుస్సు! | - | Sakshi
Sakshi News home page

భద్రత తుస్సు!

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

భద్రత తుస్సు! ధనలక్ష్మీదేవిగా మహంకాళి అమ్మవారు దర్శనం అన్నపూర్ణాదేవి అలంకారంలో బగళాముఖి అమ్మవారు ఘనంగా లక్ష మల్లెల పూజ సాగర్‌ నీటిమట్టం వివరాలు ఇప్పటివరకు 400 బస్సులకే.. ఇటీవల జరిగిన ఘటనలు..

న్యూస్‌రీల్‌

ప్రజాప్రతినిధులవే అధికం

నిబంధనలు ఇవి..

గాల్లో దీపాలు.. చిన్నారుల ప్రాణాలు

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

శ్రీవారి మంత్ర హోమం

దుర్గమ్మకు విరాళాలు

గుంటూరు
సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026
ఫిట్‌‘లెస్‌’ బస్సు..

ఈ నెల 10వ తేదీతో ముగిసిన

విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షల గడువు

కనీసం 30శాతం బస్సులకు కూడా

పూర్తికాని పరీక్షలు

50శాతంకు పైగా బస్సులు

ప్రజాప్రతినిధులవే..

తూతూ మంత్రంగా తనిఖీలు

ఎన్ని కేసులు నమోదు చేశారో

చెప్పమంటే నీళ్లు నములుతున్న వైనం

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. అమ్మవారు ధనలక్షీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కంఠంరాజుకొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.

చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి ఆలయంలో ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన నేపఽఽథ్యంలో భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్‌ సెంటర్లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్‌ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష మల్లెల పూజ నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వాహణాధికారి టి.సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్‌ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి లక్ష మల్లెలతో పూజలు నిర్వహించటంతోపాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు సువర్చలా సమేత ఆంజనేయస్వామిగా నగర పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం 8:30 గంటలకు వందలాది మంది భక్తులు, ఆంజనేయ దీక్షాపరులతో హనుమాన్‌ చాలీసా పారాయణం 108సార్లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అయినవోలు నరసింహచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్‌ దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సిహెచ్‌ రమేష్‌, మారుతి, వెంకటరమణ, బాపిరాజు, కిషోర్‌, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.70 అడుగులకు చేరింది. ఇది 157.9860 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

పట్నంబజారు: ప్రతి తల్లి, తండ్రి కలలు కనేది.. కష్టపడేది వారి చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసమే. బస్సెక్కి స్కూళ్లకు వెళ్లిన తమ చిన్నారులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేవరకు వారు పడే ఆదుర్దా అంతాఇంతా కాదు. వీటికి తోడు జిల్లాలో వరుసగా జరుగుతున్న స్కూల్‌ బస్సుల ప్రమాదాలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. చర్యలు చేపట్టాల్సిన రవాణాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. అసలు స్కూల్‌ బస్సులను వదిలేసి.. కేవలం ఆదాయ మార్గాల వనరులను వెతుక్కునే పనిలో పడ్డారనే విమర్శలు లేకపోలేదు.

పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభయ్యే సమయానికి పూర్తిస్థాయిలో విద్యా సంస్థల వాహనాలకు ఫిటెనెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారుగా 2500పైగా విద్యాసంస్థల బస్సులు ఉన్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. వీటిలో సుమారు 400 నుంచి 600 బస్సుల వరకు స్క్రాప్‌కు వెళ్లటంతో ప్రస్తుతం 1900 నుంచి 2వేల బస్సుల వరకు ఉన్నాయి. మే 10వ తేదీలోగా ఫిట్‌నెస్‌ సెంటర్‌లలో వాహన సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలని, పూర్తిస్థాయిలో అన్ని ధ్రువీకరణ పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. అయితే ఇప్పటివరకు కనీసం 400 బస్సులు కూడా ఎఫ్‌సీ పొందలేదని తెలుస్తోంది. బస్సులకు ఇంకా ఎఫ్‌సీ చేయించకపోవడం, కేసుల నమోదు సంఖ్యపై అధికారులను ‘సాక్షి’ వివరణ కోరబోగా స్పందించలేదు.

● గత కొద్ది రోజుల క్రితం చుట్టుగుంట సెంటర్‌లోని వీఐపీ రోడ్డులో ఒక పాఠశాల బస్సు డ్రైవర్‌ ఫూటుగా మద్యం సేవించి వెనుక నుంచి ముందుకు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టాడు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌ ఆటో బాగు చేయిస్తానని చెప్పటంతో.. వివాదం సద్దుమణిగింది. ఇందులో ఆలోచించాల్సింది మాత్రం ఒక్కటే.. ఎదురుగా ఆటో కాకుండా లారీ, బస్సు లాంటి భారీ వాహనం అయితే పరిస్థితి ఏంటీ..?

● ఉండవల్లి– పెనుమాక దారి మధ్యలో గుహల సమీపంలోని ఓ విద్యా సంస్థ బస్సుల డ్రైవర్‌ అతి నిర్లక్ష్యంతో నడిపి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. అయితే అందులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సులోని ఇద్దరికి మాత్రం గాయాలయ్యాయి.

● గత కొద్ది రోజుల క్రితం కొరిటెపాడు రోడ్డులో సైతం అతి వేగంగా ఒక విద్యా సంస్థ బస్సు వేగంగా వెళుతూ.. స్పీడ్‌ బ్రేకర్‌ ఎక్కించటంతో బస్సులోని కొంత మంది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇటువంటి ఘటనలు.. ఎక్కడో అక్కడ పునరావృతం అవుతూనే ఉన్నాయి.

చిత్రలేఖనంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు

7

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సంబంధించి కూటమికి చెందిన కొంత మంది ప్రజాప్రతినిధుల విద్యాసంస్థల బస్సులే అధికంగా ఉంటున్నాయి. వీటిపై తనిఖీలు నిర్వహించే ధైర్యం లేని అధికారులు.. చిన్నాచితక విద్యాసంస్థల బస్సుల్లో చిన్న తప్పులు పట్టుకుని వాటిని తనిఖీలు నిర్వహించామని ఊదరగొడుతున్నారు. ప్రధాన యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలల బస్సులను ఎందుకు తనిఖీ చేయరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

60 సంవత్సరాలు వయో పరిమితి దాటిన వ్యక్తి డ్రైవింగ్‌కు అనర్హుడు.

డ్రైవర్‌కు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డ్రైవర్‌ ఆరోగ్య పరీక్షలు ఆయా యాజమాన్యాలు విధిగా చేయించి, ఆ రికార్డులను భధ్రపరచాలి.

డ్రైవర్‌ల నియామకాన్ని ఆర్టీఓ అధికారులు తెలియజేయటంతో పాటు, 5 సంవత్సరాల అనుభవం, హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి డ్రైవర్‌లు మాత్రమే అర్హులు.

కళాశాల, స్కూల్‌ ప్రిన్సిపాల్‌, విద్యార్థుల తల్లితండ్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు, ప్రతి నెల వాహనానికి సంబంధించి స్థితిగతులను రిజిష్టర్‌ చేయటంతో పాటు, ప్రతి వాహనంలో ఫిర్యాదు పుస్తకాన్ని ఉంచాలి.

అత్యవసర ద్వారం, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, అగ్నిమాపక పరికరం, బ్యాగులు భధ్రపరుచుకునే బాక్సులు సబ్‌రూల్‌ ‘ఏ’, ‘బి’ ప్రకారం తప్పని సరిగా పాటించాలి.

ప్రతి బస్సులో ఒక అటెండర్‌ ఉండాలి.

ప్రతి వాహనంలో ప్రయాణించే విద్యార్థుల వివరాలను తప్పనిసరిగా ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు నోట్‌ చేసుకోవటంతో పాటు, తల్లితండ్రులకు డ్రైవర్‌ వివరాలను తెలియజేయాలి.

15 సంవత్సరాలు దాటిన బస్సులకు అనుమతి ఉండదు. ప్రతి ఒక్క డ్రైవర్‌ రోడ్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ.. బస్సులు నడపాలి. ఏౖదైనా ఘటన జరగక ముందే అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టడంతో పాటు, విస్త్రృత తనిఖీలు నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు.

వినుకొండ: వినుకొండ శ్రీనివాసనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష గోవింద నామ పారాయణం, శ్రీవారి మంత్ర హోమం నిర్వహించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తెనాలి గాంధీనగర్‌కు చెందిన కె.మాధవరావు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement