న్యూస్‌రీల్
పరిష్కారం వెతకని అధికారులు
ఇరిగేషన్ శాఖ అధికారులుగానీ, పట్టణ గ్రామ అధికారులుగానీ గుంటూరు చానల్ నుంచి మురుగునీటిని దాటించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం లేదు. కాలువలోకి మురుగునీటిని పంపిస్తున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో పంటపొలాల్లో ఉన్న మురుగునీరు గుంటూరు చానల్‌లో కలవకుండా కాలువ కట్టకు సమాంతరం పలు ప్రాంతాల్లో చప్టాలు ఏర్పాటు చేశారు. అలా మురుగునీటిని తరలించేవారు. ప్రస్తుతం ఆ చప్టాలన్నీ కనుమరుగు కావడంతో గుంటూరు చానల్‌కు 600 క్యూసెక్కుల నీటిని సాగు, తాగునీటి అవసరాలకు కృష్ణానది నుంచి తీసుకుంటున్నారు. మురుగునీరు కలవడంతో కృష్ణానది నుంచి తీసుకునే నీటిని కూడా అధికారులు తగ్గించినట్లు విశ్వసనీయ సమాచారం.
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 10 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా తాడేపల్లి మండలంలో 18.4, అత్యల్పంగా గుంటూరు తూర్పులో 0.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 4.1 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడికొండ మండలంలో 12.6 మి.మీ., కొల్లిపర 11.2, దుగ్గిరాల 9.6, గుంటూరు పశ్చిమ 8.2, పెదకాకాని 5.2, తుళ్లూరు 4.2, మేడికొండూరు 2.2, మంగళగిరి మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షం పడింది.
కలుషితమవుతున్న గుంటూరు చానల్ నీరు
● పలు గ్రామాలకు
తాగునీటి అవసరాలకు అవే దిక్కు
● వ్యర్థాలు, పూడిక, రసాయనాల
చేరికతో ప్రజారోగ్యంపై ప్రభావం
● నిద్రావస్థలో నీటిపారుదల,
ప్రజారోగ్య శాఖ అధికారులు
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
కృష్ణానది, కొండవీటి వాగు హెడ్ స్లూయిజ్ నుంచి గుంటూరు వరకు గుంటూరు చానల్ 47 కిలోమీటర్ల పొడవున ఉంది. కృష్ణా, పశ్చిమ డెల్టాలోని ఓ ముఖ్యమైన తాగునీటి వనరుగా మారింది. గుంటూరు చానల్‌ను పొడిగించాలని, ఆధునికీకరించాలని రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఈ చానల్‌లో పలు ప్రాంతాల్లో మురుగు కలవడంతో నీరు కలుషితం అవుతోంది. కాలువను పొడిగించేందుకు అనేకసార్లు ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ప్రస్తుత టీడీపీ సర్కారు కూడా పొడవు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ నిమిత్తం నిధులను కూడా కేటాయించింది.
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసిన మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రెండవ రోజుకు చేరాయి. చిలువూరు గ్రామస్తులు అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకరగుంట ప్రాంతాలను పరిశీలించారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా లేబర్ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే సంప్రదాయం ఉందని, ఆయా పనులకు వెళ్లగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. అడ్డాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడోరోజైన శుక్రవారం సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ అమర్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, అలంకరణ, రాత్రి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 11న ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మన్యుసూక్త సహిత చతుర్దశ కలశ స్నపన, అలంకారాలు, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, నివేదన, నీరాజనం, సాయంత్రం స్వామి వారి ఉష్ట్ర వాహనంపై గ్రామోత్సవం, 12న తెల్లవారుజామున విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత విశేష అభిషేకం, అలంకరణ, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 4గంటలకు నివేదన, నీరాజనం, తీర్థ్ధప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. రాత్రి సువర్చలా సమేత స్వామి వారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 13న స్వామివారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు.
– అఫ్రోజ్‌ఖాన్,
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి
– డాక్టర్ కె.సుబ్బారావు,
ఎండో క్రైనాలజిస్ట్
బాలికపై లైంగిక వేధింపుల కేసులో జీవితఖైదు
గుంటూరు లీగల్/చిలకలూరిపేట టౌన్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి గుంటూరు పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాయపూడి మరియదాసు(57) బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తూ ఉండేవాడు. బాలికతో మరియదాసు అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. నిందితుడి ప్రవర్తన గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అతడు తన వైఖరి మార్చుకోలేదు. దీంతో బాధితురాలి తల్లి నిందితుడి నుంచి దూరంగా నివసించడం ప్రారంభించింది. అనంతరం బాలిక చదువుతున్న పాఠశాలలో శక్తి టీం సభ్యులు ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో బాలిక తనపై జరుగుతున్న వేధింపులను టీం సభ్యులకు వివరించింది. శక్తి టీం సభ్యులు బాలిక తల్లిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షేక్ షమ్మి పర్వీన్ సుల్తానా బేగం నిందితుడు రాయపూడి మరియదాసుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదనంగా బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ అధికారులుగా సీఐ వి.సూర్యనారాయణ, ఎస్సై శివరామయ్య, కోర్టు కానిస్టేబుల్ ఎం.బాలాజీ నాయక్‌లు కేసు పురోగతికి సహకరించారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
జిల్లాలో సగటు వర్షపాతం 4.1 మి. మీ.


