ఈసెట్‌లో ప్రథమ ర్యాంక్‌ మనదే | - | Sakshi
Sakshi News home page

ఈసెట్‌లో ప్రథమ ర్యాంక్‌ మనదే

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

ఈసెట్‌లో ప్రథమ ర్యాంక్‌ మనదే

గుంటూరు ఎడ్యుకేషన్‌: పాలిటెక్నిక్‌ విద్యార్హతతో బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన ఏపీ ఈసెట్‌–2026 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 92.92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 23న రాష్ట్ర ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ అనంతపురం సంయుక్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లాలో పరీక్షలు రాసిన 1,625 మంది విద్యార్థుల్లో 1,510 మంది అర్హత సాధించారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లో గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన అంగలకుదితి నాగ అపరాజిత భవానీ లక్ష్మీ శరణ్య రాష్ట్రస్థాయిలో 1వ ర్యాంకు కై వసం చేసుకుంది. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో తెనాలి ఐతానగర్‌కు చెందిన ఆలూరి దుర్గా సిరి 7వ ర్యాంకు సాధించింది.

ఆలూరి

దుర్గా సిరి

అంగలకుదితి నాగ అపరాజిత భవానీ లక్ష్మీ శరణ్య

92.92 శాతం ఉత్తీర్ణత

Advertisement
 
Advertisement
Advertisement