గుంటూరు లీగల్: సుప్రీంకోర్టులో ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. సమాధన్ సమరో 2026లో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా హాజరు కావొచ్చని తెలిపారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–222448 లను సంప్రదించవచ్చునని తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి


