కొరిటెపాడు(గుంటూరు): ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు ఎస్‌బీఐ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, అమరావతి సర్కిల్– గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంపాలెంలోని మెయిన్ బ్రాంచ్ వద్ద ‘సైలెంట్ సిట్ ప్రొటెస్ట్‘ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ అమరావతి సర్కిల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. శాశ్వత ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ఇంటర్ సర్కిల్ బదిలీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కేఆర్‌వీ జయకుమార్, వి.నరేంద్రకుమార్, రంగసాయి, ఇబ్రహీం షా, సంపత్, యూఎఫ్‌బీయూ అడ్వైజర్ పి.కిషోర్, స్థానిక సెక్రటరీలు, పలువురు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌బీఐ ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధం
May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM
ఎస్‌బీఐ ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధం మురుగు కాల్వలో పడి డ్రైవర్ మృతి
తెనాలిరూరల్: మురుగు కాల్వలో పడి తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందాడు. స్థానిక సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలోని మురుగు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. త్రీ టౌన్ ఎస్‌ఐ నక్కా ప్రకాశరావు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తమిళనాడుకి చెందిన లారీ డ్రైవర్ సెంథిల్‌కుమార్(55)గా గుర్తించారు. మూడు రోజుల క్రితం మార్కెట్ యార్డుకు నిమ్మకాయల లోడ్‌తో వచ్చినట్లు అతని స్నేహితుడు వెల్లడించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మద్యం మత్తులో కాలువలో పడినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని వెలికి తీయించి తెనాలి వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


