బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్‌

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

తెనాలిరూరల్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌ చేశారు. మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. తెనాలి మార్కెట్‌ యార్డు వద్ద బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో త్రీ టౌన్‌ ఎస్‌ఐ షేక్‌ కరిముల్లా, సిబ్బంది గురువారం రాత్రి దాడులు నిర్వాహించారు. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఊట్ల భార్గవ్‌, మరో వ్యక్తి ‘లేసర్‌ 247’ యాప్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వీరికి గూగల్‌ పే, ఫోన్‌పే ద్వారా నాగేశ్వరరెడ్డి, లక్ష్మీ చెన్నరెడ్డి, రామ, గుణ పవన్‌, రామకృష్ణ, అతని సోదరుడు, యశ్వంత్‌, భార్గవ్‌రెడ్డి, వివేక్‌రెడ్డి నగదు బదిలీ చేసి బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్టు గుర్తించారు. బెట్టంగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన ఎనిమిది మందిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement