రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చిన్నారుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చిన్నారుల ప్రతిభ

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): విజయనగరంలోని రాజీవ్‌ స్టేడియంలో ఈనెల 5, 6, 7 తేదీల్లో జరిగిన 5వ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీలకు కాశీనాథ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ నుంచి శిక్షణ పొందిన 26 మంది క్రీడాకారులు హాజరయ్యారని అకాడమీ నిర్వాహకుడు కాశీనాఽథ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్‌ టైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు అకాడమీ క్రీడాకారులకు మూడు బంగారు, ఐదు రజతాలు, 14 మంది కాంస్య పతకాలతో సహా మొత్తం 22 పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. తమ అకాడమీ ద్వారా ఇప్పటికే ఎంతోమంది జాతీయస్థాయి పోటీలకు హాజరై ఎన్నో మెడల్స్‌ సాధించారన్నారు. రానున్న రోజుల్లోనూ జాతీయస్థాయి పోటీలకు కూడా ఇదే స్థాయిలో ఎక్కువమంది ఎంపికయ్యేలా శిక్షణ ఇస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement