గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026 పచ్చ దందా... అడ్డుందా? అధికారులకే సవాలు విసురుతున్న తెలుగు తమ్ముళ్లు పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం వివరాలు షేక్‌ షబీనాకు స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌ జనాభా పరిశోధన సంస్థ బృందం సందర్శన 24న జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఎన్నికలు దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం

న్యూస్‌రీల్‌

రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి తవ్వి తరలింపు ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఒక్కో లారీ మట్టి విక్రయం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సరఫరా ప్రజాప్రతినిధి అండదండలతో సర్కారు ఆదాయానికి గండి రూ.కోట్లలో స్వాహా చేస్తున్న టీడీపీ నాయకులు

బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026
పచ్చ దందా... అడ్డుందా?
అధికారులకే సవాలు విసురుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు.

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.20 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

నిమ్మకాయల ధరలు

తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్‌ ధర రూ.3,500 వరకు పలికింది.

తెనాలి: తెనాలి పట్టణానికి చెందిన పవర్‌ లిఫ్టర్‌ షేక్‌ షబీనా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో మరోసారి సత్తా చాటింది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సబ్‌–జూనియర్‌, జూనియర్‌, మాస్టర్స్‌ (పురుషులు, మహిళలు) ఎక్విప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో షబీనా జూనియర్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. జూనియర్స్‌లో 84 కిలోల విభాగంలో పోటీపడిన షేక్‌ షబీనా స్క్వాట్‌లో 200 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 110 కిలోలు, డెడ్‌ లిఫ్ట్‌లో 200 కిలోల బరువును ఎత్తి ఓవరాల్‌గా 510 కిలోలు బరువులతో బంగారు పతకం కై వసం చేసుకోవటం విశేషం. అదనంగా ‘ఆంధ్రప్రదేశ్‌ స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌’ను కూడా సాధించారని గుంటూరుకు చెందిన పవర్‌ లిఫ్టింగ్‌ కోచ్‌ ఎం.అశోక్‌కుమార్‌ తెలియజేశారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు పలువురకు షబీనాను అభినందించారు.

గుంటూరు మెడికల్‌: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్‌ రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ వై.రమణ ఆధ్వర్యంలో జనాభా పరిశోధన సంస్థ బృందం మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ నెల 5,6,7,8 తేదీలలో సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంలో భాగంగా జరిగే స్క్రీనింగ్‌పై సమీక్షించారు. పుట్టుకతో వచ్చే రుగ్మతలు, వ్యాధులు, లోపాలు, ఎదుగుదలలో జాప్యం ఉన్న పిల్లలను పరీక్షించి, తక్షణ చికిత్సకై జిల్లా సత్వర చికిత్స కేంద్రాలకు రిఫర్‌ చేయడం, ఫాలో అప్‌ చేయడం, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సమస్యల గురించి సమీక్షించారు. జిల్లా ప్రగతికి తగిన మార్గదర్శకాలు సూచించారు. గుంటూరు, తెనాలిలో సత్వర చికిత్స కేంద్రాలను, గుంటూరు జీజీహెచ్‌ని, ఎన్‌ఆర్‌సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం)ని సందర్శించారు. పిల్లలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్స్‌ డాక్టర్‌ అన్నపూర్ణ, డాక్టర సుజాత, ఆర్‌బీఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, మేనేజర్‌ శిరీష పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 24న గుంటూరు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికలు గుంటూరులోని జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నామినేషను స్వీకరిస్తారని, 10 – 11 గంటలకు పరిశీలన, 11 – 12 గంటలకు నామినేషన్‌ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 – ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన సభ్యుల వివరాలను ఎన్నికల అధికారి మధ్యాహ్నం 2 గంటలకు తెలియజేస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలతో ఫుట్‌బాల్‌ క్లబ్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, రెన్యువల్‌ పత్రాలు తీసుకురావాలని కోరారు.

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్‌బాబు కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని వారు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరంఆలయ అధికారి, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

గుంటూరు రూరల్‌: రూరల్‌ మండలంలో ఓబులునాయుడుపాలెం, నాయుడుపేట, వెంగళాయపాలెం, చిన్నపలకలూరు, గోరంట్ల తదితర గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో మాఫియా అక్రమ మైనింగ్‌ సాగుతోంది. ప్రజాప్రతినిధి అల్లుడు పేరుతో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం. ఏకంగా ప్రజా ప్రతినిధి కార్యాలయం నుంచి ఒకరిద్దరు వచ్చి తవ్వకాలు జరిపే ప్రాంతంలో రాత్రి, పగలు వాహనాల లెక్కలు రాసుకుంటున్నారంటే ఏ స్థాయిలో మైనింగ్‌కు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేస్తూ లారీ ఒకొక్కటి రూ. 8 వేలు – రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల ఒక ప్రైవేటు భూమిలో హక్కుదారుడికి తెలియకుండా తవ్వి మట్టి స్వాహా చేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించారు. అయినా అక్రమ మట్టి దందాను మాత్రం ఆపలేదు. స్థానిక టీడీపీ నాయకులతో కలిపి ప్రజాప్రతినిధులే ఇలా చేస్తుండటం చర్చశనీయాంశంగా మారింది.

భారీగా తవ్వకాలు

తవ్వకం మొదలుపెట్టారంటే నీరు ఊరినా ఆపడం లేదు. రూరల్‌ మండల పరిసర ప్రాంతాల్లో సుమారు 50 నుంచి 60 అడుగులు తవ్వితే నీరు ఊరుతుంది. అంటే ఏ స్థాయిలో తవ్వకాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నీటిని మోటార్లతో తోడి అక్కడే మరో పది అడుగులు తవ్వుతున్నారు. నిబంధనలకు ఇంతలా తూట్లు పొడుస్తున్నా మైనింగ్‌ అధికారులుగానీ, పోలీసులుగానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రూ.కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు రూ.లక్షల్లో మామూళ్లు వెదజల్లి పని కానిచ్చేస్తున్నారని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు.

ముగిసిన ఆహ్వాన నాటికల పోటీలు

తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్‌, శ్రీసాయి ఆర్ట్స్‌, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో కొలకలూరు పంచాయతి పరిధిలోని ఖాజీపేట కళావేదికపై జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. చిటుమడుగుల సాంబయ్య కళాప్రాంగణంలో చిటుమడుగుల భాస్కరరావు జ్యోతి ప్రజ్వలనతో చివరిరోజు ప్రదర్శనలు ఆరంభించారు. రాత్రి ఏడుగంటలకు స్వర్ణ సూర్య డ్రామా లవర్స్‌, హైదరాబాద్‌ వారి ‘సీ్త్రమాత్రే నమః’ నాటికను ప్రదర్శించారు. పూర్ణిమ పెమ్మరాజు మూలకథకు ఉదయ్‌ భాగవతుల నాటకీకరించి, దర్శకత్వం వహించారు. రాత్రి 8 గంటలకు ఏర్పాటైన సభకు కళాపరిషత్‌ ఉపాధ్యక్షులు సుద్దపల్లి మురళీధర్‌ అధ్యక్షత వహించారు. సభలో గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని కాకినాడకు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్‌ సీఎస్‌.ప్రసాద్‌కు బహూకరించారు. సభానంతరం స్నేహ ఆర్ట్స్‌–చంద్రమాంపల్లి, దివిలి వారి ‘పుట్టింటి సంపద’ నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్నిగ్ధ రచనకు, బి.రాజు దర్శకత్వంలో పి.బాలాజీనాయక్‌ పర్యవేక్షణలో ప్రదర్శించారు. నిర్వాహక కమిటి తరపున గోపరాజు రమణ, గోపరాజు విజయ్‌, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్‌ పర్యవేక్షించారు.

7

పాలిసెట్‌లో జిల్లాలో 92.95 శాతం ఉత్తీర్ణత

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదవ తరగతి విద్యార్హతతో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్‌–2026 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 92.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 25న జరిగిన పాలిసెట్‌–2026కు జిల్లా వ్యాప్తంగా హాజరైన 4,894 మంది విద్యార్థుల్లో 4,549 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన 3,032 మంది బాలురులో 2,797, 1,862 మంది బాలికల్లో 1,752 మంది చొప్పున ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 92.25 శాతం, బాలికల ఉత్తీర్ణత 94.09 శాతంగా నమోదైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఇసునూరి చేతన్‌ ఆనంద్‌ రామ్‌ రాష్ట్రస్థాయిలో 132వ ర్యాంకు, చిలకా సుజిత్‌ ప్రహర్ష్‌ 159వ ర్యాంకు, సంపతి యశ్వంత్‌ 322వ ర్యాంకు సాధించారు.

రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండలంలో అనంతవరం, వడ్డమాను అక్రమ మైనింగ్‌కు అడ్డాగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల నిర్వాహకులు, టీడీపీ నాయకులు కలిసి దందాకు పాల్పడుతున్నారు. తాడికొండ మండలంలోని లచ్చన్నగుడిపూడి, మోతడక, పాములపాడు గ్రామాలలో మైనింగ్‌ రాత్రి సమయంలో నిర్వహిస్తూ తెలుగు తమ్ముళ్ళు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. రాజధాని గ్రామాల్లో సైతం నిత్యం వందల సంఖ్యలో లారీలలో నల్లమట్టి ఇతర ప్రాంతాలకు తరలుతూనే ఉంది. చేబ్రోలు మండలంలోని శేకూరు, వీరనాయునిపాలెం, వడ్లమాను గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ నడుస్తూనే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో గ్రామ, మండల స్థాయి నాయకులు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. యడ్లపాడు మండలం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో రాత్రి సమయాల్లో మైనింగ్‌ జరుగుతూనే ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారంలో ఉన్నవారిని కూడా ఇలా అడుగుతారా? అని పేర్కొంటున్నారు. వారి బెదిరింపులకు భయపడి అధికారులు అటు వెళ్లడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement