న్యూస్‌రీల్
పశ్చిమ ఎమ్మెల్యేపై గుర్రు
ఘనంగా గంగమ్మ కల్యాణం
గుంటూరు
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో కూటమి పార్టీల మధ్య విబేధాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మొదట్లో ఏడాదిపాటు కలిసి ఉన్నా తర్వాత రాను రాను జనసేన పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తి మొదలైంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తమకు అన్యాయం జరిగిందన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మిర్చియార్డు చైర్మన్ పదవిని ఆశించిన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుకు అసంతృప్తే మిగిలింది.
ప్రస్తుతం నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన వ్యవహారం కూడా రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. పునర్విభజన ప్రక్రియ పేరుకే అధికారులు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం ఎమ్మెల్యేలే చూసుకుంటున్న సంగతి తెలిసిందే. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడులో కొంతమేర జనసేనకు సమాచారం ఇచ్చి చేసినా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పునర్విభజన ప్రక్రియలో కనీస సమాచారం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేను అడిగినా పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పశ్చిమ నియోజకవర్గ నేతలతో జనసేన పార్టీ నేత బోనబోయిన శ్రీనివాసరావు మీటింగ్ పెట్టారు. దీనిపై అమితుమీకి జనసైనికులు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
● చుట్టుగుంట రైతు బజార్‌లో తమ పార్టీకి చెందిన వారికి షాపులు కేటాయించాలని కోరితే ఒక్క షాపు కూడా కేటాయించలేదు. కొత్తగా కేటాయించిన రేషన్ షాపుల్లో జనసేన వారికి అవకాశమే లేకుండా పోయింది. పైగా గుంటూరు నగరంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో 28 రోడ్లు వేయాలని ప్రతిపాదనలు ఇవ్వగా ఒక్క ప్రతిపాదన కూడా ఆమోదించకపోవడంపై జనసేన తాజా మాజీ కార్పొరేటర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
మరోవైపు అధికారులు కూడా జనసేన నాయకులను ఏ మాత్రం లెక్కచేయడం లేదు. నల్లపాడు సీఐ వంశీధర్ ఏకపక్షంగా పనిచేస్తూ, అవినీతికి పాల్పడుతున్నా అతనిపై చర్యలు లేవు. ప్రైవేటు ఆసుపత్రిపై దాడి చేసిన కేసులో దాడి చేసిన వారికి సీఐ మద్దతుగా నిలబడటంతో జనసేన నాయకులు ఏకంగా ప్రెస్‌మీట్ పెడితేగాని అతన్ని మార్చని పరిస్థితి ఉంది. అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలులో పెట్టిన వ్యవహారంలో కూడా రాంబాబును జైలులో ఉంచడానికి జనసేన నాయకులు 2022లో ఇచ్చిన ఫిర్యాదును బయటకు తీసి తమను ఇబ్బంది పెట్టారన్న భావన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నేతలు పైకి కలిసి పనిచేస్తున్నట్లు కనపడుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుపై మండిపడుతున్నారు.
నల్లపాడు సీఐ వంశీధర్ అవినీతిపై ప్రెస్‌మీట్ నిర్వహించి, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు (ఫైల్)
గుంటూరు పశ్చిమ పరిధిలో జనసేన నాయకులు వస్తే అసలు పనులు చేయవద్దని ఎమ్మెల్యే చెప్పడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సచివాలయ అడ్మిన్లతో సమావేశంలో జనసేన వారికి తనకు సమాచారం ఇవ్వకుండా అసలు పనులు చేయడానికి వీలు లేదని చెప్పడంతో అసలు జనసేన నాయకులుకు పనులు కావడం లేదు. ఈ వ్యవహారంపై జనసేన నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆఖరికి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారం వెనుక గల్లా మాధవిని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం నాయకులు ఉండి జనసైనికులను రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవగానే ఆమెకు పొలిట్‌బ్యూరోలో స్థానం ఇవ్వడాన్ని సొంత పార్టీ నాయకులే జీర్ణించుకోవడం లేదు.
పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేద పండితులు అగ్నిహోమం నిర్వహించారు.
తమను పట్టించుకోవడం
లేదంటూ జనసేన నేతల అసంతృప్తి
నామినేటెడ్ పదవుల్లోనూ చిన్నచూపు
క్యాడర్‌తో సమావేశం నిర్వహించిన
పశ్చిమ జన సైనికులు
పోలీసుల తీరుపై అసహనం
అవినీతి అధికారులపై ప్రెస్‌మీట్ పెట్టాకే నల్లపాడు సీఐకి స్థానచలనం


