గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టర్లకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టర్లకు పతకాలు

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

మంగళగిరి టౌన్‌: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల 1వ తేదీ నుంచి 3 వరకు ఏపీ పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టర్లు పతకాలు సాధించినట్లు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయభాస్కరరావు తెలిపారు. మంగళగిరిలోని స్థానిక జిమ్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో విజేతలను అసోసియేషన్‌ సభ్యులు అభినందించారు. విజయభాస్కరరావు మాట్లాడుతూ సబ్‌ జూనియర్‌, జూనియర్‌, మాస్టర్స్‌ (మెన్‌ అండ్‌ ఉమెన్‌) ఎక్యూప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో గుంటూరు జిల్లా నుంచి 17 పతకాలు సాధించారని తెలియజేశారు. అందులో 11 బంగారు పతకాలు, 2 రజత, నాలుగు కాంస్య పతకాలు పవర్‌ లిఫ్టర్లు సాధించారని పేర్కొన్నారు. సబ్‌ జూనియర్‌ బాయ్స్‌ జట్టు మొదటి స్థానం, జూనియర్‌ మెన్‌టీమ్‌ చాంపియన్‌ షిప్‌ మొదటి స్థానం, సబ్‌ జూనియర్‌ గర్‌ల్స్‌ టీమ్‌ చాంపియన్‌ షిప్‌ మూడవ స్థానం, జూనియర్‌ ఉమెన్స్‌ టీమ్‌ మొదటి స్థానం, మొత్తం నాలుగు విభాగాల్లో టీమ్‌ చాంపియన్‌ షిప్‌ సాధించారని తెలిపారు. బెస్ట్‌ లిఫ్టర్‌ సబ్‌ జూనియర్స్‌ విభాగంలో లిఖిత మూడవ స్థానాన్ని, జూనియర్‌ ఉమెన్స్‌లో షబీనా మొదటి స్థానాన్ని, జూనియర్‌ మెన్‌లో కౌషిక్‌ మూడవ స్థానాన్ని, మాస్టర్స్‌ ఉమెన్‌లో జ్యోతివర్మ మొదటి స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను పవర్‌ లిఫ్టింగ్‌ ఇండియా సౌత్‌జోన్‌ సెక్రటరీ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ వంశీకృష్ణ, అసోసియేషన్‌ సభ్యులు అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement