జగన్‌ పాలనలో శ్రమజీవులకు మెరుగైన జీవన ప్రమాణాలు | - | Sakshi
Sakshi News home page

జగన్‌ పాలనలో శ్రమజీవులకు మెరుగైన జీవన ప్రమాణాలు

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

● వైఎస్సార్‌ సీపీ నేతలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ ● పార్టీ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో శ్రమ జీవులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు) అన్నారు. శుక్రవారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ విభాగ అధ్యక్షుడు శేషగిరి పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో మేడే (కార్మికుల దినోత్సవ) వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, షేక్‌ నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, డైమండ్‌ బాబులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కార్మిక జెండాను ఆవిష్కరించారు, అనంతరం ఆటో కార్మికులతో కలిసి కేక్‌ కట్‌ చేసి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ కార్మిక, కర్షక, రైతు సోదరులకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుందని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందించారని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి విస్తృత రీతిలో కార్యక్రమాలను అమలు పర్చడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారని అన్నారు. ప్రస్తుత టీడీపీ పాలనలో కార్మిక, కర్షక, రైతుల సంక్షేమం ఎండమావిగా మారిందని, కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం రోడ్డు ఎక్కి పోరాటాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు న్యాయమైన హక్కుల సాధన కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేత నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి పెనుమాల అరుణ్‌కుమార్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు తాడిపోయిన వేణుగోపాల్‌, విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్‌, నగర ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు మురళి, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు పటాన్‌ సైదాఖాన్‌, బాబు, మాదిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, జి.ప్రభు, అరవింద్‌, చింతపల్లి రమణ, అరుణ్‌, భాను, కేసరి సుబ్బులు, స్వర్ణలత, నందేటి రాజేష్‌, సురసాని వెంకటరెడ్డి, నాజర్‌, హనుమంతు గోపి శ్రీనివాస్‌, రామచంద్రయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement