స్పా ముసుగులో వ్యభిచారం | - | Sakshi
Sakshi News home page

స్పా ముసుగులో వ్యభిచారం

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

స్పా ముసుగులో వ్యభిచారం

గుంటూరు రూరల్‌: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. జిల్లా పోలీస్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు రెడ్డిపాలెం సమీపంలో ఐరాస్పా రిలాక్స్‌ రెన్యూ రిజువంట్‌ స్పా సెంటర్‌లో నల్లపాడు పోలీసులతో కలిసి దాడిచేయగా మేనేజర్‌ సూర్యతోపాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్ద మహిళలను, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లపాడు పోలీసులు తెలిపారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌పరిధిలోని ఇన్నర్‌రింగ్‌రోడ్డు ఫేజ్‌–2 చిల్లీస్‌ సెంటర్‌ ఎదురగల స్పా సెంటర్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసు బృందం దాడిచేసి మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారంచోటుచేసుకుంది. చిల్లీ సెంటర్‌లోని ఏ9 బ్యూటీఫుల్‌ సెలూన్‌ అండ్‌ స్పా –2 మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇతర రాష్ట్రానికి చెందిన ఒక మహిళ,11సెల్‌ఫోన్లు, స్పానిర్వాహకుడు ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement