టెన్త్‌లో బాలికలదే పైచేయి | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో బాలికలదే పైచేయి

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

టెన్త్‌లో బాలికలదే పైచేయి ● ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 550కుపైగా మార్కులు సాధించిన వేలాది మంది విద్యార్థులు గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 550కుపైగా మార్కులు సాధించిన విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. గతంతో పోల్చితే విద్యార్థులకు మార్కుల పరిధి విపరీతంగా పెరిగినట్లు కనిపిస్తోంది. వివిధ ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో గుంటూరు నగరంలోని పాతగుంటూరుకు చెందిన జి.దినేష్‌ 600 మార్కులకు 598 మార్కులు సాధించాడు. అదే విధంగా గోరంట్లకు చెందిన పలకలూరి స్వేచ్ఛ 598, అమరావతికి చెందిన కె. ఇందువదన 598 మార్కులు సాధించారు. 597, 596 మార్కులతో పాటు 550 నుంచి 595 వరకు సాధించిన విద్యార్థులు వేలాదిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో 586కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారు.

రాష్ట్రస్థాయిలో గతేడాది కంటే దిగజారిన జిల్లా స్థానం గుంటూరు జిల్లాలో 88.89 శాతం ఉత్తీర్ణత నమోదు ఫలితాల సాధనలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వేల మందికి 550కు పైగా మార్కులు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో దిగజారిన స్థానం

మంత్రి లోకేష్‌ జిల్లాలో దిగజారిన స్థానం

గుంటూరు ఎడ్యుకేషన్‌ : గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరైన 27,012 మంది విద్యార్థుల్లో 24,011 మంది ఉత్తీర్ణులయ్యారు. గుంటూరు జిల్లాలో 88.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచినా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 8వ స్థానానికి పరిమితమైంది. మూడేళ్లుగా 89 శాతానికి ఉత్తీర్ణత శాతం మించడం లేదు. బాలురు 14,377 మంది పరీక్షలకు హాజరు కాగా 12,607 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 87.69 శాతం నమోదైంది. బాలికలు 12,635 మంది పరీక్షలు రాయగా, వారిలో 11,404 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.26 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు

ç³§ø ™èlÆý‡VýS† ç³È„ýS çœÍ-™éÌZÏ hÌêÏÌZ° {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌSÌS ѧéÅ-Æý‡$¦Ë$ A™èl$Å™èl¢Ð]l$ çœÍ-™éÌS¯]l$ Ý뫨…-^éÆý‡$. hÌêÏ ÐéÅç³¢…V> {糿¶æ$™èlÓ, gñæyîlµ, Ð]l¬°Þç³ÌŒæ, Ýë…íœ$MýS çÜ…„óSÐ]l$ VýS$Æý‡$-MýS$ÌS ´ëuý‡Ô>ÌSÌS ¯]l$…_ sñ毌S¢ ç³È-„ýSË$ Æ>íܯ]l õ³§ýl MýS$r$…-»êÌS ѧéÅ-Æý‡$¦Ë$ {糆-¿ê-Ð]l…-™èl$-Ë$V> °Í-^éÆý‡$. {ò³•Ðólr$, M>Æöµ-Æó‡-sŒæ™ø ´ùsîæ ç³yìl Æ>çÙ‰-Ýë¦Æ‡$$ÌZ A«¨MýS Ð]l*Æý‡$PË$ Ý뫨…-^èl-yýl…-™ø-´ër$ hÌêÏÌZ sêç³Æý‡$ÏV> °Í-^éÆý‡$. {糿¶æ$™èlÓ ´ëuý‡Ô>ÌSÌZÏ A™èlÅ«¨MýS Ô>™èl… Ð]l$…¨ ѧéÅÆý‡$¦Ë$ E¡¢-Æý‡$~Ë$ M>Ð]l-yýl…-™ø-´ë}-ెMýS$PÐ]l Ð]l*Æý‡$PË$ Ý뫨…-_¯]l ѧéÅ-Æý‡$¦Ë$ Ð]l…§ýlÌS Ð]l$…¨ E¯é²Æý‡$. õ³§ýl, Ð]l$«§ýlÅ ™èlÆý‡VýS† ™èlÍÏ-§ýl…-{yýl$Ë$ B¯]l…§ø-™éÞ-à-ÌS™ø E¯é²Æý‡$.

ప్రథమ శ్రేణిలో 20,504 మంది ఉత్తీర్ణులు

అత్యధిక శాతం మంది ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై వారే ఉన్నారు. పరీక్షలు రాసిన 27,012 మందిలో 24,011 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో 20,807 మంది ప్రథమ శ్రేణి పొందారు. మిగిలిన వారిలో 2,430 మంది ద్వితీయ, 774 మంది తృతీయశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

17 ప్రభుత్వ బడుల్లో వందశాతం ఉత్తీర్ణత..

జిల్లాలోని 186 ప్రభుత్వ పాఠశాలల్లో 17 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదే విధంగా 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేసినవి 54 ఉన్నాయి. 50 శాతంలోపు నమోదు చేసిన పాఠశాలలు నాలుగు ఉన్నాయి. యాజమాన్యాల వారీగా ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 97.67 శాతం, ప్రైవేటు పాఠశాలలు 95.51 శాతం, సోషల్‌ వెల్ఫేర్‌ 92.89, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 78.94, జెడ్పీ 78.48, ఎయిడెడ్‌ 76.39, మున్సిపల్‌ 74.82, ప్రభుత్వ పాఠశాలల్లో 73.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా స్థానం రాష్ట్రస్థాయిలో దిగజారింది. మారుమూల ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న గుంటూరు జిల్లాలో 88.89 శాతంతో 8వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం. విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో టెన్త్‌లో ఉత్తీర్ణత 88.89 శాతానికి పరిమితం కావడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement