తెనాలి రూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలోగల అభయ హస్త సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా గణపతి, బాలాంబిక సమేత సర్వ హితేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్యశర్మ, సహాయకుడు పోలేపెద్ది రామకృష్ణ, ఆలయ అర్చకుడు శుభం శర్మ, మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ పాలడుగు సురేంద్ర, కిక్కూరి శ్రీనివాసరెడ్డి తదితరులు జస్టిస్ రామసుబ్రమణియన్ దంపతులకు స్వాగతం పలికారు.


