మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో గురువారం ఉదయం విశేష అభిషేకం, విశేష అలంకరణ నిర్వహించారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పార మాత్మిక నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను శేష వాహనంపై అధిష్ఠింప జేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్‌కుమార్ పర్యవేక్షించారు.


