రేపటి నుంచి వేసవి శిక్షణ శిబిరం | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వేసవి శిక్షణ శిబిరం

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

నృసింహునికి లక్ష పుష్పార్చన వైభవంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ట మహోత్సవం అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం రూ.ఐదు కోట్ల విలువైన సాగు భూమి స్వాధీనం ●

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఎన్టీఆర్‌ స్టేడియంలో మే 1 నుంచి 31 వరకు సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపు నిర్వహిస్తామని స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న క్యాంపునకు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, జిఎంసీ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌తోపాటు ప్రజాప్రతినిదులు హాజరవుతారన్నారు. అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, చెస్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్కేటింగ్‌, షటిల్‌ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. 14 ఏళ్ల వయస్సులోపు పిల్లలు అర్హులన్నారు. స్విమ్మింగ్‌కు అత్యధికంగా 250 మంది చిన్నారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అనుభవజ్ఞులైన శిక్షకుల పర్యవేక్షణలో ఈ శిక్షణ నిర్వహిస్తామన్నారు. స్టేడియం ఉపాధ్యక్షుడు దామా మహేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని వేసవి శిక్షణలో చేర్పించేందుకు ముందుకు రావాలన్నారు. నెల రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంయుక్త కార్యదర్శి పాకనాటి ఉమామహేశ్వరరావు, కోశాధికారి కండే కాంతారావు, ఈసీ సభ్యులు ఇంకొల్లు వెంకట రత్తయ్య, గోనుగుంట్ల హనుమంతరావు, శివజ్యోతి, అంజలి పాల్గొన్నారు.

నిమ్మకాయల ధరలు

పులిచింతల సమాచారం

తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లో పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన వైనం

త్రుటిలో తప్పించుకున్న కన్నవారు

ఆస్తివివాదాల నేపధ్యంలో ఘటన

7

మంగళగిరి టౌన్‌ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ముఖ మండపంలో బుధవారం స్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో బుధవారం నూతన జీవ ధ్వజ స్తంభం పునఃప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో మంతెన విఠల్‌ శ్రీనివాస్‌ శర్మ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ స్తంభ పునః ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించారని తెలిపారు.

మాచవరం: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బంధువుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

తెనాలిరూరల్‌: ప్రైవేటు వ్యక్తులు సాగు చేసుకుంటున్న సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్‌ కేవీ గోపాలకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల వెనుక పొలాల్లో 2012లో ప్రభుత్వం సేకరించిన 61 సెంట్ల భూమి ఉంది. అనేక కారణాలతో అది ఖాళీగా ఉండడంతో అక్కడ పొలాలు సాగు చేసే రైతులే ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతు రత్తయ్య తాను కౌలుకు తీసుకున్న పొలాలతో పాటు ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల జరిపిన రీ సర్వేలో 61 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నటు తహసీల్దార్‌ గుర్తించారు. ఈ నేపథ్యంలో సాగుదారుడితో మాట్లాడి భూమిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో భూమి విలువ సుమారు రూ. ఐదు కోట్లు ఉంటుంది.

కన్నకూతురు ఘాతుకం

చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లిఖార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుకన్య, మల్లిఖార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో మూడేళ్ల కిందట విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు పట్టణంలోని గుర్రాలచావిడిలో ఉన్న తల్లిదండ్రుల వద్దే ఉండేది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం.. ఏడాది నుంచి మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తూ పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి ఉంటుంది. ఈ క్రమంలో తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 9గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచలో ఉన్న గ్రిల్స్‌ నుంచి లోపలికి పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు తగలబడి పోయాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.9600, మోడల్‌ ధర రూ.7200 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ

33.9320 టీఎంసీలు.

Advertisement
 
Advertisement
Advertisement