గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 పదోన్నతుల పితలాటకం! గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్‌ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పదోన్నతి ద్వారా రావాల్సిన జూనియర్ అసిస్టెంట్‌ల పోస్టులను ఆసుపత్రి అధికారులు భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. సుమారు 9 ఏళ్లుగా ఈ పోస్టులను భర్తీ చేయడం లేదు. మూడు పర్యాయాలు నోటిఫికేషన్లు ఇచ్చారు తప్ప, ఏడాదిలోపు పోస్టులు భర్తీ చేయకపోవడంతో నోటిఫికేషన్లు సైతం కాలపరిమితి ముగిసి రద్దయ్యాయి. ఆసుపత్రి అధికారుల తీరుతో పదోన్నతులు రాక ఆర్థికంగా కిందిస్థాయి ఉద్యోగులు వాపోతున్నారు.
కోర్టు తీర్పు సైతం..
గుంటూరు జీజీహెచ్‌లో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్‌ల ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసేందుకు గతంలో మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. నోటిఫికేషన్లు ఇచ్చిన సమయంలో అధికారులు కొన్ని రకాల క్యాడర్లు ప్రమోషన్‌ల జాబితాలో చేర్చడంపై కొందరు ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నోటిఫికేషన్ రద్దు చేశారు. మరో ఏడాది విరామం అనంతరం 2018లో ఇరువురికి ప్రమోషన్లు ఇచ్చారు. మరలా కింది స్థాయి సీనియార్టీ జాబితాలో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా జాప్యం చేశారు. దాంతో సీనియార్టీ జాబితాలో ఉన్న ఉద్యోగులు తమ ప్రమోషన్లు ఇవ్వకపోవడం వల్ల నష్టపోతున్నామని కోర్టు దృష్టికి తమ సమస్య తీసుకెళ్లడంతో, కోర్టు ప్రమోషన్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిని పాటించడం లేదు. ప్రతినెలా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్నాయంటూ జిల్లా కలెక్టర్‌కు పంపించే ఉద్యోగ క్యాడర్ స్ట్రెంత్ జాబితాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఖాళీగా చూపిస్తున్నారు. దీంతో కారుణ్య నియామకాల ద్వారా బయట నుంచి అభ్యర్థులు జీజీహెచ్‌లో జూనియర్ అసిస్టెంట్లుగా విధుల్లో చేరుతున్నారు. ఆసుపత్రి ఉద్యోగులకు కౌన్సెలింగ్ పెట్టి ప్రమోషన్లు ఇవ్వాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నారు.
తప్పిదాలు వెలుగులోకి వస్తాయనే..!
పదోన్నతులు ఇవ్వకపోవడానికి కారణం గతంలో జరిగిన తప్పిదాలేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రమోషన్ సైకిల్ ప్రక్రియ ప్రకారం గతంలో జూనియర్ అసిస్టెంట్‌లుగా కింది స్థాయి సిబ్బందికి ప్రమోషన్ ఇవ్వలేదని, అందువల్లే నేడు ఆ తప్పిదాలు బయటకు వస్తాయని ప్రమోషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గతంలో అధికారులు చేసిన తప్పిదాలు సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత అధికారులపై ఉన్నప్పటికీ ఆతప్పిదాలను సాకుగా చూపించి ప్రమోషన్‌ల ప్రక్రియ నిలిపివేయడం ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు నేడు ప్రమోషన్‌లకు దూరమవుతున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ సీ.ఎం.సాయికాంత్ వర్మ కలుగజేసుకుని ప్రమోషన్లు వచ్చేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం
కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో, నష్టపోయిన అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌కు సైతం తమ ప్రమోషన్‌ల గోడు లిఖిత పూర్వకంగా వెళ్ల బోసుకున్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సైతం గత ఏడాది పరిశీలించి ప్రమోషన్‌ల ద్వారా కింది స్థాయి ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వాలని లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ జీజీహెచ్ అధికారులు పట్టించుకోవడం లేదు..
గుంటూరు
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● 9 ఏళ్లుగా ప్రమోషన్లకు
నోచుకోని జీజీహెచ్ సిబ్బంది
● జూనియర్ అసిస్టెంట్ పోస్టులను
భర్తీ చేసేందుకు తాత్సారం
● గతంలో మూడుసార్లు
నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయమట్టం బుధవారం 525.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 450 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది.