ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ గోల్డెన్ జూబిలీ వేడుకల సందర్భంగా కళాశాలల రెండు రోజుల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చివరి రోజు బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జాన్ డేవిడ్ ఆడిటోరియంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.గంగాధర్ రావు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా డాక్టర్ గజల్ శ్రీనివాస్, అర్జున అవార్డు గ్రహీత ఒలింపియన్ మంగళ్ సింగ్ చాంపియా, కళారత్న దామోదర గణపతిరావు పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం, రెక్టర్ ప్రొఫెసర్ ఆర్. శివరాం ప్రసాద్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఆర్‌విఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ హాజరయ్యారు. కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎం.త్రిమూర్తి రావు వ్యవహరించారు. వీసీ ప్రొఫెసర్ కె.గంగాధర్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం కృషి చేయాలని, నిరంతరం నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కళారత్న శ్రీ దామోదర గణపతి రావు ,ఆర్చరీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ, అర్జున అవార్డు గ్రహీత మంగళ్ సింగ్ చాంపియా, డాక్టర్ గజల్ శ్రీనివాస్‌లు మాటాడారు. ఆయన ఆలపించిన గజల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రొఫెసర్ కె.వీరయ్య, ప్రొఫెసర్ పి. పి. ఎస్. పాల్ కుమార్ , ప్రొఫెసర్ కె. తేజోమూర్తి, ప్రొఫెసర్ ఆర్‌వి నిరుపమలు తమ కళాశాలల పురోగతిని వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


