న్యూస్‌రీల్
గుంటూరు నగరంలో నాలుగో రోజైన మంగళవారం కూడా ఇంధన కొరత కొనసాగింది. ఇంధన కొరత లేదని జిల్లా అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో అది కాగితాలకే పరిమితం అయింది. నగరంలోని పలు బంకులు తెరిచినప్పటికీ నామమాత్రంగానే విక్రయాలు జరిపారు. ఆయా బంకుల వద్ద వాహనదారులు క్యూలు కట్టారు. డీజిల్ కోసం ఆటోలు, పెద్ద వాహనదారులు అవస్థలు పడ్డారు. పలు బంకులు మూత పడి ఉండడం కనిపించింది. సాయంత్రం నుంచి పలు
బంకుల్లో సాధారణ పరిస్థితి కనిపించింది. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు


