ప్రత్యామ్నాయం చూపలేదు.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయం చూపలేదు..

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

ప్రత్యామ్నాయం చూపలేదు.. సామాన్లు కూడా తీసుకోనివ్వడం లేదు.. ఇళ్లల్లో నుంచి లాగిపడేయండి అంటున్నారు.. రోడ్డున పడ్డాం..

గత ఏడాది క్రితం ఇళ్ళను కూల్చివేశారు. వారికి ఇప్పటి వరకూ ఇళ్ళుకానీ, ఇళ్ళ స్థలాలు కానీ చూపించలేదు. మరలా ఇప్పుడు మరో వంద మందిని రోడ్డున పడేస్తున్నారు. అధికారులు, కూటమి పెద్దలు కావాలని స్వర్ణభారతినగర్‌లోని పేదలను రోడ్డున పడేస్తున్నారు. – బడేబీ, బాధితురాలు

ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చేస్తున్నారు. ఇళ్లలో పనికొచ్చే సామగ్రిని కూడా తీసుకోకుండా బాధితులకు మరింత నష్టం కలిగిస్తున్నారు. కావాలని కూటమి నాయకుల కుట్రతో నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

– ప్రమీల, బాధితురాలు

మున్సిపల్‌ అధికారులు వచ్చి కనీసం సమాచారం లేకుండా పోలీసుల అండతో ఇళ్లలోని సామానులను సైతం రోడ్డుపై విసిరేసి ఇళ్ళను ఖాళీ చేయిస్తున్నారు. అదేమని అడిగితే అసిస్టెంట్‌ కమిషనర్‌ సైతం పోలీసులకు ఇళ్లలోంచి వారిని బయటకు లాగి పడేయండి అంటూ పోలీసులను ఆదేశిస్తున్నారు.

– నాగలక్ష్మి, బాధితురాలు

ఇంటిని కూల్చివేస్తే కట్టు బట్టలతో రోడ్డుపై పడ్డాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియటంలేదు. చిన్నపిల్లలతో మండుటెండలో రోడ్డుపై నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఎంత మొత్తుకున్నా కనికరించటంలేదు. – మానస, బాధితురాలు

Advertisement
 
Advertisement
Advertisement