నగరంపాలెం: రైల్వేలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్షల్లో కాజేసినట్లు బాధితుడు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పీజీఆర్‌ఏస్ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. బాధితుల సమస్యలను జిల్లా ఎస్పీ ఆలకించారు. అర్జీదారుల సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), మధుసూదనరావు (గుంటూరు సీసీఎస్) అర్జీలు స్వీకరించిన వారిలో ఉండగా, 172 ఫిర్యాదులు వచ్చాయని డీపీఓ వర్గాలు తెలిపాయి.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


