తొలుత 23వ తేదీన అనుకున్నామని, బదులుగా 25వ తేదీన నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ‘పొన్నూరు రైతు పోరాట దీక్ష’ను ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష’గా మార్పు చేసి జిల్లాలోని మొక్కజొన్న రైతుల సమస్యలపై పోరాడుతున్నట్టు వివరించారు.
25వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, జిల్లాలోని సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, జిల్లా నాయకులతోపాటు, మొక్కజొన్న రైతులు భారీగా తరలిరానున్నట్టు తెలిపారు.
సార్వాలో వరికి గిట్టుబాటు ధరలేక ఎకరాకు ఒక్కో రైతు రూ.25 వేలు నష్టపోయారని అన్నారు. ఈ రబీలో మొక్కజొన్న పంటను వేశారని తెలిపారు.
జిల్లాలోనే ప్రధానంగా పొన్నూరులో నలభై వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరికొంత భాగం జొన్న పండించారని తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు ప్రకటించిన విధంగా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంతో రైతులు పచ్చగా ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటి వరకు పొన్నూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఎక్కడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఒక్కటీ ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు.
బహిరంగ మార్కెట్‌లో దళారులు క్వింటాల్ రూ.1,400 నుంచి రూ.1,650 వరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీంతో రైతు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
ఇప్పటికై నా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400లకు మొక్కజొన్న కొనుగోలు చేసి జిల్లాలో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్, నాయకులు ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభం ...
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రైతులు భారీగా రాక
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వెల్లడి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష’ను ఈ నెల 25వ తేదీన గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గసమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.


