ఉత్తమ ప్రదర్శన ‘ఇది అతని సంతకం’
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో అభినయ ఆర్ట్స్, గుంటూరు వారి ‘ఇది అతని సంతకం’ నాటిక ఉత్తమ ప్రదర్శన గా ఎంపికైంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతులను నటుడు, దర్శకుడు ఎన్.రవీంద్రరెడ్డి స్వీకరించారు. నాటికల పోటీలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా కళాంజలి, కట్రపాడు వారి ‘కిడ్నాప్’ నాటిక ఎంపికైంది. ఇదే నాటికకు ద్వితీయ ఉత్తమ నటిగా ఎస్.పూజిత, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ బాలనటుడు బహుమతు లు లభించాయి. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీకిరణం మెమోరియల్, గుంటూరు వారి ‘తరమెళ్లిపోతుందిరా’ నాటిక ఎంపికైంది. గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికకు ఉత్తమ రచన బహుమతి రాగా, అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘విడాకులు కావాలి’ నాటికలో నటించిన గంగోత్రి సాయి ఉత్తమ నటుడు బహుమతిని అందుకున్నారు. శ్రీకృష్ణా తెలుగు థియేటర్ ఆర్ట్స్, గుడివాడ వారి ‘అపస్వరం’ నాటికకు ఉత్తమ సంగీతం , శ్రీసాయికార్తీక్ క్రియేషన్స్, కాకినాడ వారి ‘దేవుడు కనిపించాడు’ నాటి కకు ఉత్తమ రంగాలంకరణ, స్వర్ణసూర్య డ్రా మా లవర్స్, హైదరాబాద్ వారి ‘సాహితీ సూక్తం’కు ఉత్తమ ఆహార్యం బహుమతులు లభించాయి. న్యాయనిర్ణేతలుగా ఎ.నర్సిరెడ్డి, బొర్రా నరసయ్య వ్యవహరించారు. ముగింపు సభలో విజేతలకు బహుమతులందించారు.
నాటకకళకు ప్రోత్సాహం అవసరం
ముగింపు సభలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా పరిషత్ పోటీలను నిర్వహిస్తున్న ఆరాధ్యుల కన్నా, లక్ష్మణశాస్త్రిలను అభినందించారు. కళాభిమానులు, కళాపోషకులు ప్రోత్సహించాలని కోరారు. సభకు కొల్లిపరలోని శ్రీకళానిలయం కార్యదర్శి బొమ్మారెడ్డి ప్రభాకరరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత నృత్యగురువులు ఆలపాటి ప్రజ్ఞ, చిలకలపూడి ముకుందప్రియను సత్కరించారు.
ముగిసిన జాతీయస్థాయి
నాటికల పోటీలు
ఉత్తమ ప్రదర్శన ‘ఇది అతని సంతకం’


