వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైతే ప్రజలను నిలువునా వచించింది. కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండానే వరికపూడిశెలకు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతం ప్రజలను మభ్యపెట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మాచర్లలో కరువు దీక్ష చేపట్టారు. ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తే పల్నాడును సస్యశ్యామలం చేసే వరికపూడిశెల ప్రాజెక్టును ఖచ్చితంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత కీలకమైన వరికపూడిశెల ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పనులు ప్రారంభించనున్నారు.