ఇంటర్‌ ‘అడ్వాన్స్‌డ్‌’కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ‘అడ్వాన్స్‌డ్‌’కు సర్వం సిద్ధం

May 23 2023 6:52 AM | Updated on May 23 2023 7:22 AM

- - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌ఐవో గర్నెపూడి సునీత చెప్పారు. సాంబశివపేటలోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 100 పరీక్ష కేంద్రాల పరిధిలో 49,771 మంది విద్యార్థులు హాజరు కానున్నారని చెప్పారు. వీరిలో ప్రథమ సంవత్సరం 36,173, ద్వితీయ సంవత్సరం 13,598 మంది ఉన్నారని వివరించారు.

గుంటూరు జిల్లా పరిధిలోని 54 కేంద్రాల్లో 28,149, పల్నాడు జిల్లాలోని 34 కేంద్రాల పరిధిలో 16,631, బాపట్ల జిల్లాలోని 12 కేంద్రాల్లో 4,991 మంది చొప్పున హాజరు కానున్నట్లు తెలిపారు. జూన్‌ 2న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, 3న జరగనున్న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్షలకు గతంలో తప్పిన, గైర్హాజరైన ఫస్టియర్‌ విద్యార్థులు విధిగా హాజరుకావాలని ఆమె స్పష్టం చేశారు.

ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థుల సహా విధుల్లో ఉన్న ఏ ఒక్కరికీ సెల్‌ఫోన్లతో వచ్చేందుకు అనుమతి లేదని చెప్పారు. పరీక్షల విధుల్లో ఉన్న అధికారులతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు, ఇన్విజిలేటర్ల వద్ద సెల్‌ఫోన్లు ఉండేందుకు అనుమతి లేదన్నారు. సమావేశంలో డీఈసీ సభ్యులు జి. బాలమోహన్‌రావు, పి.సుధాకర్‌, పాండురంగారావు పాల్గొన్నారు.

ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో...
ప్రథమ సంవత్సర పరీక్షలు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

విద్యార్థులు నిర్దేశిత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించరు.

విద్యార్థులు హాల్‌ టికెట్‌, ప్యాడ్‌, పెన్ను మరే ఇతర సామగ్రి వెంట తీసుకు రాకూడదు.

ప్రత్యక్ష నిఘా .. విస్తృత తనిఖీలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 100 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

ఇంటర్‌బోర్డు నుంచి ఉన్నతాధికారులు లైవ్‌ స్ట్రీమింగ్‌ విధానంలో ప్రత్యక్షంగా పరిశీలిస్తారు.

పరీక్ష కేంద్రాల్లో మాల్‌ ప్రాక్టీసుల నిరోధానికి బోర్డు నుంచి ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్ల సారథ్యంలో తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తాయి.

సమస్యలు, సందేహాల పరిష్కారానికి గుంటూరు ఆర్‌ఐవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ (0863–2228528) ఏర్పాటు

60 శాతం బెటర్‌మెంట్‌ విద్యార్థులే..
ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో ఫస్టియర్‌ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏకంగా 36,173 మంది దరఖాస్తు చేయగా, వీరిలో పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కంటే అధిక మార్కుల కోసం బెటర్‌మెంట్‌ రాస్తున్న వారు 60 శాతం మంది ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement