జ్ఞానానిధి స్వామి వివేకానందుడు

Spiritual Story Of Swami Vivekananda - Sakshi

"ఏకమేవ అద్వితీయం బ్రహ్మ " సృష్టిలో బ్రహ్మం తప్ప అన్యమేదీ లేదనీ; 'సర్వం ఈశావాస్యం' = సకల చరాచర సృష్టి  అంతా ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీ కృతమై ఉన్నదనీ; భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి, బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునః ప్రతిష్ఠించిన వివేకరత్నం ఆదిశంకరాచార్యులు.

*ప్రతి ఒక్కరూ దివ్యాత్మస్వరూపులనీ;ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితమై ఉందనీ,అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని సాక్షారింపజేసుకోవడమే మానవ జీవితధ్యేయమనీ సర్వవేదాంత సారాన్ని ప్రపంచానికి ప్రబో దించి, సనాతన ధర్మాన్ని పరిరక్షించిన వివేక భాస్కరుడు-స్వామి వివేకానంద.

*సమస్త ప్రపంచాన్నీ ప్రగతి పథంలో నడి పించగల శక్తిసామర్ధ్యాలు వివేకావందునిలో ఉన్నట్లు ఆయన గురుదేవులైన శ్రీ రామకృష్ణ పరమహంస గుర్తించారు. భారతజాతి గర్వించదగిన ప్రాచీన సంప్రదాయాల గురించి, ఆ సంస్కృతినీ, యోగ్యతల్ని ఇప్పటి ప్రజలు కూడా సంరక్షించుకొంటున్న వైనం వివేకా నందుని ద్వారా ఆయన అనుయాయుల ద్వారా ప్రపంచజాతుల ముందు వివరంగా ఆవిష్కుతం కావడం ముదావహం.

*ప్రపంచదేశాలకు ఈయదగిన సంస్కృతి  భారతజాతికి ఉందనీ, స్వతంత్ర దేశంగా భాసించే యోగ్యతల్ని పొంది ఉన్నదనీ స్వామి వివేకానంద నిరూపించారు; అభ్యర్ధ నల ద్వారా గాక శౌర్యంతో, పురుషాకారంతో భారతీయులు స్వాతంత్ర్య సముపార్జన చేయగలరని ఋజువు చేసారు.

*వివేకానందుని ధైర్యసాహసాలు అస మానం. ఆయన పురుష సింహంగా వెలుగొందారు. ఆ మహనీయుని దివ్యశక్తి ప్రభావం ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో  మనపై ప్రసరిస్తూనే ఉంది. అది ఎక్కడ ఏ రూపంలో ఉందో మనం ఊహించలేం. కానీ అది చాలా పటిష్ఠమైనదిగా, ఉత్కృష్టమై నదిగా భారతావని ఆత్మలో భాగంగా భాసిస్తోంది. ఆ విధంగా వివేకానంద తన మాతృమూర్తి హృదయంలో, ఆమె సంతతి హృదయాల్లో నివసిస్తూనే ఉన్నారు. అంటారు శ్రీ అరవిందులు.

*నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో , అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృతపరచుకో, ఆత్మ స్వరూపాన్నిగ్రహిస్తున్న కొద్దీ మనలో శక్తి అధికమవు తుంది. అప్పుడు బంధాలన్నీ తెగిపోతాయంటారు స్వామి వివేకానంద. 

*స్వామి వివేకానంద 39 ఏళ్లు మాత్రమే జీవించారు. కానీ ఈ పరమ శంకరుడు మానవాళికి అందించిన జ్ఞాననిధి అనంతం. ఆ పరమేశ్వరుని పవిత్ర పాదస్పర్శతో పునీతమైన ఈ పుణ్యభూమిలో జన్మించినమనం అపారమైన జ్ఞానానికి వారసులమవుదాం. అమరత్వాన్ని అర్హతలుప్రసాదించమంటూ ఆ పరమ శివుణ్ణిప్రార్థిద్దాం.
- గుమ్మా ప్రసాద రావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top