బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!

This Professor Created A Tree That Can Produce 40 Different Kinds Of Fruits - Sakshi

రేగి పండ్లు, నేరేడు పండ్లు తినాలంటే ఆయా సీజన్లకోసం ఎదురు చూడకతప్పదు. సీజన్‌ వెళ్లిపోయాక మళ్లీ కావాలంటే ఎక్కడా దొరకవు. ఏ ఋతువులో పండేవి ఆ ఋతువులోనే దొరుకుతాయి. ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు అన్ని కాలాల్లో కాస్తే! ఊహ బాగానే ఉంది కానీ.. ఒకే చెట్టుకి రకరకాల పండ్లు ఎలా సాధ్యం అని అలోచిస్తున్నారా? ఇది కల కాదు.. అబద్ధం అంతకన్నాకాదు. నిజంగానే ఓ వ్యక్తి ఒకే చెట్లు​కి 40 రకాల పండ్లు కాయించాడు.

పెన్సిల్వేనియాలోని రీడింగ్‌ సిటీకి చెందిన సామ్ వాన్ అకెన్ అనే వ్యక్తి ఈ రకమైన చెట్లను పెంచుతున్నాడు. జన్యుపరంగా ఒకేరకమైన మొక్కలను అంటుకట్టడం ద్వారా ఇది సాధ్యపడిందట. విత్తనాలు ఉండే పండ్ల మొక్కలను జన్యుపరంగా అంటుకట్టడం ద్వారా ఈ చెట్టును సృష్టించాడు. ఇది ఒక రకమైన సైన్స్‌ ఎక్పరిమెంట్‌ అని చెప్పవచ్చు. 

ఈ చెట్టు కూడా మామూలు చెట్లలాగానే పెరుగుతుంది. ఐతే వసంత (స్ప్రింగ్‌), వేసని (సమ్మర్‌) ఋతువుల్లో మాత్రం ఈ చెట్టు అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవట. పింక్‌ కలర్‌లో చూపరులను ఆకట్టుకుంటుంది. తర్వాత నెలల్లోనే ఈ చెట్టు రేగు, పీచెస్‌, ఆప్రికాట్‌ పండ్లు, నేరేడు పండు, బాదం.. ఇలా 40 రకాల పండ్లు కేవలం మూడేళ్లకే కాయడం మొదలు పెడుతుందట. ఈ ప్రక్రియ మొత్తాన్ని శామ్‌ వాన్‌ అకెన్‌ మాత్రం దీనిని ఆర్ట్‌ వర్క్‌లా భావిస్తానని చెబుతున్నాడు. 

40 రకాల పండ్ల చెట్టును సృష్టించడానికి వివిధ రకాల విత్తన పండ్ల మొక్కలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. పారిశ్రామికీకరణ, ఏకీకృత సంస్కృతి వల్ల ఆహార ఉత్పత్తిలో వైవిధ్యాన్ని గుర్తించాను. వాణిజ్యపరంగా తక్కువ లాభదాయకమైన అనేక పండ్ల జాతులు కనుమరుగవుతున్నాయనే విషయం కనుగొన్నాను. రైతులు, పండ్ల తోటలు పెంచే వారినుంచి సేకరించిన మొక్కల ఆధారంగా 40 పండ్ల చెట్లను సృష్టించానని అకెన్ చెప్పుకొచ్చాడు.

ఇది నమ్మశక్యం కానప్పటికీ.. అతను ఈ విధమైన మొక్కలు అనేకం సృష్టించాడు. అమెరికాలోని అర్కన్‌సాస్, కెంటుకీ, మైనే, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియాలో వాన్ అకెన్ చెట్లను చూడవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల పండ్ల చెట్లను పెంచడం, సాగు చేయడం, శుభ్రపరచడం.. చాలా సమయం, స్థలం వృధా అవుతుంది. కోరిన పండ్లన్నీ ఒకే చెట్టుకి కాస్తే.. అనే అతని వినూత్న ఆలోచన నుంచే ఈ చెట్టు ఉద్భవించింది.

చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top