అల్జీమర్స్‌ నివారణకు... | Precautions to take prevent forgetfulness | Sakshi
Sakshi News home page

అల్జీమర్స్‌ నివారణకు...

Sep 20 2026 6:41 AM | Updated on Sep 20 2026 6:45 AM

Precautions to take prevent forgetfulness

రేపు అల్జీమర్స్‌ డే

పెద్దవయసులో మతిమరపు మాత్రమే కాకుండా... అసలు తామెవరో, తమ ఉనికి ఏమిటో తెలినంతంగా మరపు రావడం పెద్ద దురవస్థ. అనేక రకాల  మతిమరపుల్లో చాలా ముఖ్యం. అన్ని రకాల మతిమరపు కేసుల్లో  అల్జీమర్స్‌ కారణంగా మరపు రావడం దాదాపు 60 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుంది. ఈ నెల (సెప్టెంబరు) 21న ప్రపంచ అలై్జమర్స్‌ డే సందర్భంగా ఈ సమస్య నివారణకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేమిటో చూద్దాం...

→ పెద్దవయసువారు తరచూ రక్తపాటు (బీపీ) చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. చాలాకాలం పాటు హైబీపీ ఉండటం మతిమరపు (డిమెన్షియా)ను ఎక్కువ చేస్తుంది. అది పరోక్షంగా అల్జీమర్స్‌కూ దారితీయవచ్చు 

→ ఆహారంలో ఉప్పు తగ్గించడం మంచిది. ఇది బీపీని నియంత్రణలో ఉంచడమే కాకుండా... పరోక్షంగా అల్జీమర్స్‌ నివారణకూ కొంతవరకు తోడ్పడుతుంది 

→ నిత్యం చురుగ్గా ఉండేవారితో పాలిస్తే... మందకొడి కదలికలు ఉన్నవారిలో అల్జీమర్స్‌ వచ్చేందుకు 60 శాతం వరకు ఎక్కువగా అవకాశాలుంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ 30 – 45 నిమిషాల పాటు నడక అల్జీమర్స్‌ నివారణకే కాదు... పూర్తి ఆరోగ్యానికీ దోహదపడుతుంది 

→ నడక లాంటి వ్యాయామాలతో దేహానికే కాకుండా... మనసుకూ, మెదడుకూ వ్యాయామం ఇవ్వడం మంచిది. రోజూ పత్రికల్లో లేదా సోషల్‌ మీడియాలో కనిపించే పజిల్స్, సుడోకూ, గళ్లనుడికట్టు వంటి ‘మెదడుకు మేత’ అంశాల్ని  ప్రాక్టీస్‌ చేయడం అల్జీమర్స్‌ నివారణకు చాలావరకు ఉపకరిస్తుంది 

→ సృజనాత్మకంగా ఆలోచించేవారిలో అల్జీమర్స్‌ అవకాశాలు తక్కువని అధ్యయనాల్లో తేలింది. మంచి ఊహాశక్తితో సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉండటంతో పాటు తమ అభిరుచి మేరకు తమకు ఆసక్తి ఉన్న కళలను  ప్రాక్టీస్‌ చేస్తుండటం కూడా దాన్ని నివారించవచ్చు.

డాక్టర్‌ శైలేష్‌ మోదీ
సీనియర్‌ న్యూరాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement