ద్రుపదుడు ఏం చేయాలనుకున్నాడు?

Prashnottara Bharatam Draupadi Marriage Devotional Story - Sakshi

ప్రశ్నోత్తర భారతం

ధౌమ్యుడు అంగీకరించగానే పాండవులు ఏమనుకున్నారు?
ధౌమ్యుడు అంగీకరించినందుకు సంతోషించారు. సకల భూరాజ్యం పొందినంత ఆనందించారు. ఆయన దీవెనలు అందుకున్నారు. తమ వృత్తాంతమంతా తెలియపరిచారు.

ధౌమ్యుని అనుమతి పొంది ఏం చేశారు?
పాంచాల రాజ్యానికి బయలుదేరారు.

మార్గ మధ్యంలో ఎవరు కనిపించారు?
వేదవ్యాసుడు కనిపించాడు. రాను న్న శుభాల గురించి పాండవులకు చెప్పి, వెళ్లిపోయాడు.

పాండవులు ఎక్కడకు చేరుకున్నారు?
కుంతి సహితంగా పాంచాల దేశానికి చేరారు. కాంపిల్య నగరంలో ప్రవేశించారు. కుమ్మరివాని ఇంట విడిది చేశారు. ఇతరులకు తెలియకుండా బ్రాహ్మణ వృత్తిలో జీవించసాగారు.

ద్రుపదుడు ఏం చేయాలనుకున్నాడు?
తన కుమార్తెను అర్జునునికి ఇవ్వాలనుకుని, వెదికించాడు

అర్జునుడు కనిపించకపోవడంతో ద్రుపదుడు ఏం చేశాడు?
అర్జునుడు కనిపించకపోవటంతో, స్వయంవరం ఏర్పాటుచేశాడు. ఆ స్వయంవరానికి కాశీ వస్త్రాలు, కవచాలు ధరించిన అనేక దేశాల రాజులు వచ్చారు.

స్వయంవర రంగస్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
కాంపిల్య నగరానికి ఈశాన్య దిక్కున ఏర్పాటుచేశారు. రంగస్థలం చుట్టూ అగడ్త ఏర్పాటుచేశారు.

కాంపిల్యానికి వచ్చిన వారంతా ఎక్కడ కూర్చున్నారు?
రాజులు రంగస్థలానికి చేరి, ఉచితాసనాలలో కూర్చున్నారు. పాండవులు బ్రాహ్మణులలో కూర్చున్నారు.

సభా మండపానికి వచ్చిన ద్రౌపది ఎలా ఉంది?
తెల్లని రత్నభూషణాలు ధరించింది. తెల్లని గంధం అలముకుంది. చేతిలో తెల్లని పుష్పమాలను ధరించింది, మన్మధుని పూల బాణంలా ఉంది.

ధృష్టద్యుమ్నుడు ఏమన్నాడు?
రాజకుమారులారా! ఈమె నా సోదరి కృష్ణ. ఈమె అయోనిజ. అగ్ని నుంచి పుట్టింది. ఇక్కడ ఉన్న అగ్నిహోత్రానికి సమీపంలో మహా ధనుర్బాణాలున్నాయి. వాటిలో ఐదు బాణాల చేత మత్స్యయంత్రాన్ని భేదింయిచ ద్రౌపదిని వరించాలి అన్నాడు. 
– నిర్వహణ: వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top