అందాల భామల ‘సహజ’ రూపం!

Most Beautiful Women in the World Natural Look Without Make Up - Sakshi

అందంగా ముస్తాబవడం అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ వేడుకలోనైనా తామే ‘సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌’గా ఉండాలని కోరుకుంటారు మగువలు. అయితే కొంతమంది సహజంగా ఉండటానికి ఇష్టపడితే.. ఇంకొంత మంది మేకప్‌తో తమ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ విషయంలో హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. వాళ్లు మేకప్‌ లేకుండా బయటకు వచ్చే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి తమ ఆరాధ్య నటీమణుల నిజ రూపం ఎలా ఉంటుంది, వాళ్లు ఎలాంటి కాస్మొటిక్స్‌ వాడతారో తెలుసుకోవాలని మహిళా అభిమానులు ఉబలాటపడుతుంటారు. అయితే ‘అందం’గా కనిపించడం మన చేతుల్లోనే ఉంటుందని.. మేకప్‌తో దీనికి సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఈ అందగత్తెలు. టీవీ, సినీ, సంగీత ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సుందరీమణులు తమ ‘నేచురల్‌ లుక్‌’తో కట్టిపడేస్తూ.. సహజత్వమే నిజమైన అందమని చాటిచెబుతున్నారు.

కేటీ హోమ్స్‌, నటి

టీవీ సిరీస్‌ ‘డాసన్స్‌ క్రీక్‌’లో జాయ్‌ పాటర్‌(ఫీమేల్‌ లీడ్‌)గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ 1997లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణిస్తోంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌క్రూజ్‌ను పెళ్లాడిన(ప్రస్తుతం విడిపోయారు) 41 ఏళ్ల ఈ భామకు కూతురు ‘సురి’ ఉంది.‘‘50 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ పీపుల్‌( పీపుల్స్‌ మ్యాగజీన్)’’లో ఒకరిగా నిలవడమే గాకుండా పలు సినీ వేడుకల్లో ప్రేక్షకులందరి చూపును తన వైపునకు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ మేకప్‌ లేకుండా ఇదిగో ఇలా ఉంటారు.

నయోమీ వాట్స్‌, బ్రిటీష్‌ నటి

ఆస్ట్రేలియన్‌ డ్రామా ‘ఫర్‌ లవ్‌ అలోన్‌’తో ఎంట్రీ ఇచ్చిన నయోమీ ఎలెన్‌ వాట్స్‌ నటిగా, నిర్మాతగా గుర్తింపు పొందారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన 51 ఏళ్ల నటీమణి నేచురల్‌ లుక్‌ ఇది.

టైరా బాంక్స్‌, అమెరికన్‌ నటి

బాంక్స్‌గా సినీ అభిమానులకు సుపరిచితమైన ఈ భామ 15 ఏటనే మోడలింగ్‌ ప్రారంభించారు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నటిగా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా ఎదిగారు. పలు మ్యాగజీన్‌ కవర్లపై దర్శనమిచ్చి, పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌తో పాటు పలు వేడుకల్లో రెడ్‌ కార్పెట్లపై హొయలొలికించిన 46 ఏళ్ల ఈ ఆఫ్రికన్‌- అమెరికన్‌ విత్‌ అవుట్‌ మేకప్‌ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

డయానే క్రూగర్‌, ఫ్యాషన్‌ మోడల్‌

జర్మనీలో జన్మించిన డయానే క్రూగర​ ఫ్యాషన్‌ మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి నటిగా మారారు. టీవీ షో ది బ్రిడ్స్‌తో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న డయానే మేకప్‌ చేసుకుంటేనే అందంగా కనిపిస్తామనుకోవడం అపోహే అని నిరూపిస్తున్నారు.

గ్వేన్‌ స్టెఫానీ, సింగర్‌

తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే గ్వేన్‌ స్టెఫానీ నటిగానూ తనను తాను నిరూపించుకుంటున్నారు. ‘నో డౌట్‌’మ్యూజిక్‌ బ్యాండ్‌లో లీడ్‌ వోకలిస్టు అయిన ఆమె.. జస్ట్‌ ఏ గర్ల్‌, స్పైడర్‌వెబ్స్‌, డోన్ట్‌ స్పీక్‌ వంటి ఆల్బమ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 90వ దశకంలో పలు ప్రత్యేక ప్రదర్శనల్లో భారత సంప్రదాయానికి అద్దంపట్టే విధంగా నుదుటిన ‘బిందీ’ ధరించేవారు. ఎక్కువగా ముదరు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో కనిపించే ఈ భామ మేకప్‌ లేకుండా కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నారు.

అలీసియా సిల్వర్‌స్టోన్‌

ది క్రష్‌తో 1993లో తెరంగేట్రం చేసిన అలీసియా సిల్వర్‌స్టోన్‌ బ్యాట్‌మన్‌ అండ్‌ రాబిన్ వంటి భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటించారు. మూగజీవాల కోసం పోరాడే ఆమె.. పెటా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. వీగన్‌ అయిన అలీసియా.. ది కైండ్‌ డైట్‌ పేరిట పుస్తకం ప్రచురించారు. 43 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తన కూతురితో కలిసి తీసుకున్న సెల్ఫీ ఇది.

బెల్లా హదీద్

ఇక వీరితో పాటు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బెల్లా హదీద్‌, ఇవా లంగోరియా, మిలా జొవోవిచ్‌, సల్మా హయేక్‌, పెనెలోప్‌ క్రూజ్‌, పాప్‌ సంచలనం షకీరా, అడెలె, షరాన్‌ స్టోన్‌, క్యాథరిన్‌ జెటా జోన్స్‌, క్రిస్టియానా, మార్లిన్‌ మన్రో తదితర సెలబ్రిటీలకు సంబంధించిన ‘నేచురల్‌ లుక్‌’ ఎలా ఉంటుందో ఓ సారి చూసేయండి.  

ఇవా లంగోరియా

మిలా జొవోవిచ్

సల్మా హయేక్‌, పెనెలోప్‌ క్రూజ్

పాప్‌ సంచలనం షకీరా

అడెలె​​​​​​​

షరాన్‌ స్టోన్‌​​​​​​​

క్యాథరిన్‌ జెటా జోన్స్‌​​​​​​​

క్రిస్టియానా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top