పేపర్‌ కవర్‌ ధర పదివేలా? ఏముందిరా అందులో..? | Sakshi
Sakshi News home page

పేపర్‌ కవర్‌ ధర పదివేలా? ఏముందిరా అందులో..?

Published Wed, Jan 3 2024 3:21 PM

Luxury Brand Hermes Raises Eyebrows Single Paper Envelope - Sakshi

సాధారణంగా మనం వాడే పేపర్‌ కవర్‌ (ఎన్వలప్‌) ఎంత ఉంటుంది. పది, ఐదు, మహా అయితే రెండు వందలు ఉంటుంది. కానీ  ఫ్రెంచ్ లగ్జరీ డిజైన్ హౌస్ హెర్మేస్ ఇంటర్నేషనల్  ప్రస్తుతం ఒకే పేపర్ ఎన్వలప్‌ను వేల రూపాయలకు విక్రయిస్తోంది. దీనికి సంబంధించిన స్టోరీ ఒకటి ఇంటర్నరెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. అయితే దీనికి  ఓ ప్రత్యేకత ఉంది.

హెర్మేస్ వెబ్‌సైట్ ప్రకారం, “సిగ్నేచర్ ఆరెంజ్ హెర్మేస్ పేపర్ ఎన్వలప్” ఆరెంజ్‌పేపర్‌ బాక్స్‌లో పట్టుదారాలతో చుట్టి ఉంటుంది. A4 , A5 అనే రెండు  సైజుల్లో ఇది  అందుబాటులో ఉంది. దీంట్లో  ట్రావెల్‌ డాక్యుమెంట్స్‌, టిక్కెట్లు , ఇతర పత్రాలను దాచుకోవచ్చు. అంతేకాదు “ప్రత్యేక ఆహ్వానం లేదా ప్రేమ ప్రకటన” కోసం కూడా  అపురూపంగా  పదిలపర్చు కోవచ్చు.

ఫ్రాన్స్‌లోప్రత్యేకంగా రూపొందించిన ఈపేపరు కవరు ధరసుమారు రూ. 10,411 (125 డాలర్లు)కి  విక్రయిస్తోంది. అంతేకాదు దీన్ని రీయూజ్‌ చేసుకోవచ్చు. హెర్మేస్ హై-ఎండ్ స్టేషనరీ కలెక్షన్‌లో దీన్ని ప్రత్యేకంగా  భావిస్తారు. కొందరు ఇది కాస్ట్‌లీ గురూ అంటోంటే, మరికొందరు  మాత్రం స్టేటస్‌ బాస్‌ అంటారట.  

కాగా హీర్మేస్ ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్‌ ప్రొడక్ట్స్‌ ధరలు సోషల్‌ మీడియాలో  వైరల్‌  కావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది Balenciaga ట్రాష్‌ బ్యాగ్‌ ఒక్కొక్కటి రూ. 1.4 లక్షలకు విక్రయించడం వైరల్‌గా మారింది. అలాగే 7.5 అంగుళాల సమర్కాండే మోడల్‌తో సహా వివిధ విలువైన పేపర్‌వెయిట్‌ ధర  2,950 డాలర్లు, అలాగే మౌస్ ప్యాడ్ 405 డాలర్లంటే ఆశ్చర్యమే మరి. 1837 నుండి విలాసవంతమైన ఉత్పత్తులకు, ముఖ్యంగా  సాండిల్స్, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర లెదర్‌ వస్తువులకు ప్రసిద్ధి చెందింది ఈ బ్రాండ్‌.  

Advertisement
 
Advertisement