‘కివి’తో రోగనిరోధక శక్తి ఖాయం..!

Kiwi Helps With Immunity In Winter Season - Sakshi

పండు ఒక్కటే... ఫలితాలు ఎన్నో

సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో మంచి డైట్‌లో భాగంగా ఏదైనా తీసుకోవాలంటే కివియే అంటున్నారు నిపుణులు. చూడడానికి సపోటాలా కనిపించే ఈ కివి పండు శీతాకాలంలో మనం తినే ఆహారంలో కచ్చితంగా ఉండాల్సింది. కివి ఇప్పుడు మన దేశంలో విరివిగా దొరుకుతుంది. ఈ పండుని న్యూజిలాండ్‌లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఆ దేశ క్రికెటర్లను కివీస్‌ అంటుంటాం అనుకుంట.. ఈ పండు తినడం ద్వారా మనకు అనేక పోషక విలువలు, విటమిన్లు, రోగ నిరోధక శక్తి లభిస్తుంది. 

సి-విటమిన్‌ మనకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. కివి ఈ పండులో ఇది పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కివి కాలరీ ఫ్రెండ్లీ ఫ్రూట్‌, అందుకే డైట్‌ ప్లాన్‌ ఉన్న వారికి  ఇది బాగా ఉపయోగపడుతుంది. రోజూ మనం తినే బ్రేక్‌ ఫాస్ట్‌, సలాడ్స్‌, స్మూతీస్‌, షేక్స్‌లో వాడవచ్చు. కివి పండు ద్వారా మనకు దాదాపుగా 42 కేలరీలు పొందవచ్చును. మరి కివి ద్వారా మనకు ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం:

జీర్ణక్రియ వేగవంతం: 
కివి పండులో మనకు ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. అది మన జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా యాంటిఆక్సిడెంట్స్‌ ఉండటంతో డయేరియా, నాసియా,గ్యాస్‌,మలబద్దకం వంటి మానసిక వ్వాధులకు నిరోధకంగా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తి :
సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. దాని ద్వారా మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సి విటమిన్‌ అవసరమైన మోతాదులో కావాలంటే దీన్ని డైట్‌లో భాగంగా తీసుకుంటే సరిపోతుంది.
గుండెకు మేలు:
కివి పండు గుండెకు ఎంతో మేలు. రక్తపోటును నియంత్రించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా పోషకాహారం కలిగి గుండె సంబంధిత వ్యాధులను ఎక్కువ రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
ఆస్తమాకి మంచిది:
ఆస్తమాతో భాదపడుతున్న వారు కివి పండు ద్వారా ప్రయోజనం పొందవచ్చు. యాంటీఆక్సిడెంట్స్‌, సి-విటమిన్‌ ఉండటంతో ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా అలర్జీలను దగ్గర రానివ్వకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది.
కంటి చూపు పెంచుతుంది:
రోజు డైట్‌లో కివి పండును తీసుకోవడం ద్వారా కంటిచూపు మందగించకుండా ఉపయోగపడుతుంది. కివిలో లుటిన్‌, జియాక్సంత్‌ ఉండటంతో ఆరోగ్యమైన కంటి చూపును పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు మీ రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడాని ఆహారంలో తీసుకునే ఉత్తమ పండ్లలో కివి ఒకటి. శీతాకాలంలో శరీరం అలర్జీలు ,అనారోగ్యానికి గురయ్యేటప్పుడు, కివి వంటి పండ్లు మంచి ఎంపిక.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top