అందాల చందమామ కాజల్‌ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

kajal Aggarwal Stuns In Glorious Varun Bahla saree Price And Pictures - Sakshi

చందమామ వన్నె తగ్గుతుందా? టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ అందం కూడా అంతే! బిడ్డకు తల్లి అయినా తరగని సొగసుతో మెరిసిపోతోంది! ఖాళీ లేని కాల్‌షీట్లతో కెరీర్‌లో దూసుకుపోతోంది. ఆ అవకాశాల వెల్లువకు ఆమె టాలెంట్, ఫిట్‌నెస్‌లే కాదు ఆమె క్రియేట్‌ చేసుకున్న ఫ్యాషన్‌ స్టయిల్‌ కూడా కారణమే!

ఆ క్రెడిట్‌లో ఈ బ్రాండ్స్‌నీ భాగం చేయాల్సిందే! ఫ్యాషన్‌ విషయంలో నేను చాలా బద్ధకంగా ఉంటాను. షూటింగ్‌ లేనప్పుడు క్యాజువల్‌ వేర్‌లోనే ఉంటాను. ఎందుకంటే నాకు.. నేను ధరించే దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలి.

వరుణ్‌ బహ్లా..
.. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్స్‌లో ఒకరు. 2004లో తన పేరు మీదనే ఫ్యాషన్‌ హౌస్‌ని ప్రారంభించి, అనతి కాలంలోనే సూపర్‌ ఇమేజ్‌ను సంపాదించాడు. దాదాపు బాలీవుడ్‌ సెలబ్రిటీలు అందరూ కనీసం ఒక్కసారైనా ఈ డిజైనర్‌ వేర్‌ని ధరించి ఉంటారు. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్‌ ఉన్నాయి. ధర లక్షల్లోనే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. కాజల్‌ ధరించిన వరణ్‌ బహ్లా డిజైనర్‌ చీర ధర రూ. 2,10,000/-

మినరలి జ్యూయెల్స్‌
వెబ్‌సైట్‌ ద్వారా ప్రారంభించిన వ్యాపారం.. తన అందమైన డిజైన్స్‌తో ఇప్పుడు సెలబ్రిటీలకూ మోస్ట్‌ ఫేవరెట్‌ అయింది. ఎవరికైనా నప్పే.. ఎవరైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘మినరలి’ జ్యూయెల్స్‌ ప్రత్యేకత. ఈమధ్యనే ముంబైలో ఒక స్టోర్‌ ఓపెన్‌ చేశారు. ఆన్‌లైన్‌లోనూ  కొనుగోలు చేయొచ్చు. ఆభరణాల నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు.జ్యూలరీ బ్రాండ్‌: మినరలి జ్యూయెల్స్‌ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.  

--దీపిక కొండి

(చదవండి: బుట్టబొమ్మ పూజా హెగ్డే ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top