ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం! చక్కటి నిగారింపు మీ సొంతం

If You Do This With Milk Acne On The Face Will Disappear - Sakshi

పచ్చిపాలు, రోజ్‌ వాటర్‌ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వలయాకారంగా మర్దన చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్‌ బాల్‌తో తుడిచేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఐదు నిమిషాలు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి.

రెండు టేబుల్‌ స్పూన్ల వేపాకు పేస్టులో టేబుల్‌ స్పూను తేనె, ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల పచ్చి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడు సార్లు ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల మొటిమలు పోయి ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. 

పచ్చిపాలు ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తేమ కోల్పోయిన చర్మానికి తేమనందిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా ఈ వీటిలో ఏదైనా ఒక పద్ధతిని అనుసరిస్తే ముఖం మీద మొటిమలు వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం నిగారింపుతో మెరిసిపోతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top