కొత్త హెయిర్‌ స్టైల్‌ లుక్‌లో విరాట్​ కోహ్లీ..ధర వింటే షాకవ్వుతారు! | How Much Does Virat Kohli Hairstyle Cost? Check Here - Sakshi
Sakshi News home page

Virat Kohli Hairstyle: కొత్త హెయిర్‌ స్టైల్‌ లుక్‌లో విరాట్​ కోహ్లీ..ధర వింటే షాకవ్వుతారు!

Published Sun, Apr 7 2024 5:59 PM

How Much Does Virat Kohli's Hairstyle Cost - Sakshi

సినీ తారలు, స్పోర్ట్స్‌ స్టార్‌ల పట్ల అభిమానుల్లో ఎంత క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు ధరించే దుస్తులు దగ్గర నుంచి వాచ్‌లు, షూలు వరకు దేన్ని వదిలిపెట్టకుండా అనుకరిస్తుంటారు అభిమానులు. అందులోకి ముఖ్యంగా వారు చేయించుకునే హెయిర్‌స్టయిల్స్‌ అస్సలు వదిలపెట్టరు. అలాగే సెలబ్రిటీలు కూడా అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త స్టెయిలిష్‌ హెయిర్‌ స్టయిల్స్‌లో దర్శనమిస్తుంటారు. దీన్ని ఎక్కువగా అనుసరించేది స్పోర్ట్స్‌ స్టార్‌ ఆర్సీబీ ప్లేయర్‌ విరాట్​ కోహ్లీ అని చెప్పొచ్చు. అతడు ప్రతి ఐపీఎల్‌ సీజన్‌కి ఓ కొత్త లుక్‌లో కనిపిస్తాడు. ఈసారి కూడా అలానే ఓ కొత్త లుక్‌ ట్రై చేశాడు. ఈ కొంగొత్త హెయిర్‌ స్టయిల్స్‌ కోసం ఎంత ఖర్చు చేస్తాడో వింటే షాకవ్వుతారు. 

స్టార్‌ క్రికెటర్‌గానే కాకుండా అత్యంత స్టైయిలిష్‌ ఇండియన్‌ క్రికెటర్‌గా కూడా విరాట్‌కి మంచి పేరు ఉంది. అతని దుస్తులు, హెయిర్‌ స్టైల్‌ తరుచు జనాల్లో చర్చనీయాంశంగా ఉంటాయి. అంతలా అతడి స్టైలింగ్‌ ప్రజలను ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. ఈ 2024 ఐపీఎల్‌లో కూడా కొత్త హెయిర్‌ స్టైల్‌ లుక్‌లో కనిపించాడు విరాట్‌. ఆ హెయిర కట్‌ ధర ఎంతో ప్రముఖ హెయిర్‌ స్టైలర్‌ అలీమ్‌ హకీమ్‌ వెల్లడించాడు. బాలీవుడ్‌ తారల నుంచి స్పోర్ట్స్‌ స్టార్‌ల వరకు చాలామందికి అతనే హెయిర్‌ స్టైలింగ్‌ చేస్తుంటారు.

ఈ నైపుణ్యంతోనే అతను మంచి పాపులర్‌ అయ్యాడు కూడా. స్పోర్ట్‌ స్టార్స్‌లో ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లికి అతడే ఎక్కువగా డిఫరెంట్‌ డిఫరెంట్‌ స్టైల్స్‌లో హెయిర్‌ కట్‌ చేస్తుంటాడు. అతడి ఫీజు స్టార్టింగే ఏకంగా రూ. లక్షల్లో మొదలవుతుందట. మహీ, విరాట్లు తన వద్దే హెయిర్‌ స్టైలింగ్‌ చేయించుకుంటారని హకీమ్‌ చెబుతున్నాడు. ఐపీఎల్‌ వస్తున్నందున తనను డిఫరెంట్‌గా ఏదైన కొత్త స్టయిల్‌ ట్రై చేయమని విరాట్‌ అడిగారని చెప్పుకొచ్చాడు.

అతడెప్పుడూ కొత్త కొత్త స్టైల్స్‌ని ట్రై చేస్తుంటాడని అన్నారు. ఈ సారి అతడి హెయర్‌ స్టయిల్‌లో కొత్త లుక్‌ని ప్రయత్నించామని అ‍న్నారు. కనుబొమ్మల్లో స్పిలిట్స్‌ ఉండేలా హెయిర్‌ కట్‌ చేశామని అన్నారు. కొద్దిగా హెయిర్‌ని ఒకవైపు పూర్తిగా ఫేడ్‌గా ఉంచి వెనుక భాగంలో కొద్దిగా జుట్టుని వదిలేసి, కలర్‌ వేసినట్లు వివరించాడు. అందుకు సంబంధించిన ఫోటోని కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

కాగా ఐపీఎల​ 2024 విషయానికి వస్తే.. విరాట్​ కోహ్లీ టీమ్​ ఆర్సీబీ (రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు).. 5 మ్యాచుల్లో 4 మ్యాచులు ఓడిపోయి..ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక ధోనీకి చెందిన చెన్నై సూపర్​ కింగ్స్ (సీఎస్కే).. ​4 మ్యాచ్‌ల్లో 2 గెలిచి..  3వ స్థానంలో కొనసాగుతోంది.

(చదవండి: ఐదుపదుల వయసులోనూ ఫిట్‌గా ఉండే మాధవన్‌.. నాన్‌వెజ్‌ లాగిస్తాడట!)


 

Advertisement
 
Advertisement