నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? | Sakshi
Sakshi News home page

నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? చూస్తే షాకవ్వాల్సిందే!

Published Sun, Jan 7 2024 1:52 PM

Have You Ever Known About These Walking Trees - Sakshi

నడిచే చెట్ల గురించి విన్నారా?. ఔను! మీరు వింటుంది నిజమే!. ఈ చెట్లు నిజంగా నడుస్తాయి అది కూడా సూర్యకాంతిని వెతుక్కుంటూ నడుస్తాయట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?. నిజం నడిచేలా వాటి చెట్ల ఆకృతి కూడా అందుకు త‍గ్గట్టుగా ఉంటుంది. పైగా అలా నడిస్తే భూమిలో ఉన్న వేరు తెగిపోతుంది లేదా దాంతోపాటు ఎలా కదులుతుంది అని కదా డౌటు. అయితే ఆ చెట్టు ఎలా నడుస్తుంది? ఎలా కదులుతుందో సవివిరంగా చూద్దాం!.

ఈ రకం చెట్టు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్లను సక్రాటియా ఎక్సరిజా అంటారు. వాటి మూలాలు సూర్యకాంతి దిశగా పెరుగుతాయి. అందువల్ల ఇవి నడుస్తాయట. ఇవి అచ్చం తాటి చెట్టు మాదిరిగా ఉండే ప్రత్యేకమైన చెట్లు. ఏడాదికి సుమారుగా 15 నుంచి 20 మీటర్లు పొడవు పెరుగుతాయని లెక్కించారు శాస్త్రవేత్తలు. దీని వ్యాసం 16 సెం.మీ ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తాటి చెట్టు వేళ్లు ఎక్కువగా నేలలోపలికి చొచ్చుకుని ఉంటాయి.

ఈ చెట్లకి మాత్రం వాటి వేర్లు భూమికి వెలుపల చీపురి ఆకృతిలో ఉంటాయి. ఈ ప్రత్యేక రకం తాటి చెట్లు నడుస్తున్నప్పుడు వాటికి ఉ‍న్న పాత వేర్లు ఊడిపోవడం(నశించిపోవడం) జరుగుతుందట. ఇలా అవి రోజుకి రెండు నుంచి 3 సెం.మీ వరకు నడుస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలా ఏడాదికి ఈ చెట్టు సుమారు 20 మీటర్ల దూరం వరకు నడుస్తాయని అంచనా వేశారు. ఇలాంటి చెట్లు దట్టమైన అడవుల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఇది నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ!. సూర్యరశ్మిని అనుసరిస్తూ కదలడం అలా ఏకంగా కొంత దూరం వరకు నడవడం అనేది శాస్త్రవేత్తలకు ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉంది. 

(చదవండి: ఆ ఊరిలో నాలుగొందలకు పైగా ఇళ్లు ఉన్నాయ్‌! కానీ సడెన్‌గా..)

Advertisement
Advertisement