జస్ట్‌ వ్యాయమాలతోనే బెల్లీ ఫ్యాట్‌ తగ్గిపోతుందా..? | Fitness influencer said this exercise helped her lose 8 inches belly fat | Sakshi
Sakshi News home page

జస్ట్‌ వ్యాయమాలతోనే బెల్లీ ఫ్యాట్‌ తగ్గిపోతుందా..?

May 26 2025 5:05 PM | Updated on May 26 2025 5:58 PM

Fitness influencer said this exercise helped her lose 8 inches belly fat

మహిళల్లో కొందరు డెలివరీ తర్వాత బెల్లీఫ్యాట్‌తో ఇబ్బందిపడుతుంటారు. అలాగే కొందరు మగవాళ్లు కూడా ఈ సమస్యను ఎదర్కొంటుంటారు. దీన్ని తగ్గించుకోవడం గురించి పలు డైట్‌లు, వ్యాయామాల వర్కౌట్ల సమాచారం నెట్టింట ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉన్నాయి కూడా. అయితే దీన్ని జస్ట్‌ వ్యాయామాలతోనే కరిగించేసుకోగలమా అంటే..

ఇటీవల ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ తాను ఒక వర్కౌట్‌ ప్రాక్టీస్‌ చేశానని అది బాగా వర్కౌట్‌ అయ్యి బెల్లీఫ్యాట్‌ తగ్గిందని చెప్పుకొచ్చింది. ఆ వ్యాయామం వల్లే తన బెల్లీఫ్యాట్‌ ఎనిమిది అంగుళాల వరకు తగ్గిందని తెలిపింది. ఆర్యోకరంగా ఉండటానికి వ్యాయమాలు అవసరమే కానీ అదొక్కటి చేసి బరువు తగ్గించుకోగలమా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. 

అలాగే బెల్లీఫ్యాట్‌ కూడా ఒక్క ఆ వ్యాయమంతోనే తగ్గిపోతుందని నిర్థారించలేమని అంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరకమైన ఆహారం, బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల తోపాటు సరైన వ్యాయమాలతోనే దీన్ని తగ్గించుకోవడం సాధ్యమని చెబుతున్నారు. సాధారణంగా వ్యాయమాలు చేయగానే వేలాడే పొట్ట తగ్గిన అనుభూతి వస్తుంది. ఎందుకంటే కేలరీలు బర్న్‌ అవ్వడమే గాక పొట్ట తగ్గడమే లక్ష్యంగా వ్యాయమాలు చేస్తారు కాబట్టి తగ్గినట్లు అనిపిస్తుంది గానీ..కొన్నిరోజుల తర్వాత యథావిధిగా వేలాడే పొట్ట ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 

బొడ్డుకొవ్వు తగ్గించుకోవడం తోపాటు బరువు కూడా అదుపులో ఉండాలని వ్యాయమాలు, చక్కటి డైట్‌ పాటిస్తేనే మంచి ఫలితం పొందగలరని నిపుణులు వెల్లడించారు. మనం తీసుకునే కేలరీలకు అనుగుణంగా ఎనర్జీ బర్న్‌ అయ్యేలా మన వర్కౌట్లు ఉండేలా ఫిట్‌నెస్‌ నిపుణుల సలహాలు తీసుకోవాలని అన్నారు.

కండరాలు బలోపేతం అయ్యేలా బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..ఆటోమేటిగ్గా బెల్లీఫ్యాట్‌ మాయం అవుతుందని అన్నారు. ఇక్కడ పోషకాహార, సరైన వర్కౌట్‌లు కీలకమనే విషయం గుర్తెరగాలని చెబుతున్నారు నిపుణులు. 

 

(చదవండి: మస్తుమజా ‘మష్‌రూమ్స్‌’..! ఆదివాసులు మెచ్చే ఆహారం..)
 

Advertisement
 
Advertisement
Advertisement