20న పండ్లు, కూరగాయలపై ఎఫ్‌.ఎ.ఓ. వెబినార్‌

FAO on Fruits and Vegetables on Webinar‌ september 20t  - Sakshi

అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) ఈ నెల 20న వెబినార్‌ను నిర్వహించనుంది. చిన్న, సన్నకారు రైతుల చిన్న కమతాల్లో, పెరటి తోటల సాగులో సవాళ్లు, అవకాశాలపై చర్చిస్తారు. ఈ అంశంపై ఎఫ్‌.ఎ.ఓ. ప్రచురించిన సావనీర్‌ను విడుదల చేస్తారు. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆంగ్ల వెబినార్‌లో ఉచితంగా పాల్గొనదలచిన వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు..
https://fao.zoom.us/webinar/register/WN_xZvk3yfwQLWgUtdjnemJHw

19న కొర్నెపాడులో మిరప సాగుపై శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో సెప్టెంబర్‌ 19 (ఆదివారం)న ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప సాగుపై రైతునేస్తం శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇస్తారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన మహిళా రైతు లావణ్యారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు..
97053 83666

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top