ఎలక్ట్రోథెరపీ డివైజ్‌.. కాంతివంతమైన చర్మం కోసం

Electrotherapy Device for beauty Therapy - Sakshi

కలువ కన్నుల కోసం, మెరిసే పెదవుల కోసం ఐలైనర్లు, ఐలాష్‌లు, లిప్‌ స్టిక్స్, లిప్‌ కేర్స్‌ ఉండనే ఉన్నాయి. కానీ చర్మంలో మృదుత్వం, కాంతి లేకపోతే.. ఎంత మేకప్‌ వేసినా ఆ అందం అసహజంగానే కనిపిస్తుంది. చర్మం ముడతలు పడినా, మచ్చలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలతో అందహీనంగా మారినా.. అన్నింటినీ మాయం చేసేందుకు ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్‌ ఓ మ్యాజిక్‌ స్టిక్‌లా పనిచేస్తుంది. పైగా ఈ డివైజ్‌.. జుట్టుకోసం ప్రత్యేకమైన దువ్వెనను కూడా అందిస్తోంది. ఈ అల్టిమేట్‌ హై ఫ్రీక్వెన్సీ బ్యూటీ ఎక్విప్‌మెంట్‌ అందించే థెరపీ.. సౌందర్య ప్రియులకు అద్భుతమైన వరమనే చెప్పాలి. 

మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలను పూర్తిగా తొలగించే ఈ ఎలక్ట్రోథెరపీ డివైజ్‌.. చర్మంపై పడిన ముడతలనూ శాశ్వతంగా పోగొడుతుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. మష్రూమ్‌ ట్యూబ్, బెంట్‌ ట్యూబ్, టంగ్‌ ట్యూబ్, కూంబ్‌ ట్యూబ్‌.. అనే నాలుగు ప్రత్యేకమైన ట్యూబ్స్‌ ఈ మెషిన్‌తో పాటు లభిస్తాయి.
మష్రూమ్‌ ట్యూబ్‌ను గాడ్జెట్‌కి అటాచ్‌ చేసి, స్విచ్‌ ఆన్‌ చేస్తే.. ముడతలు, గీతలు, మృతకణాలను తొలగిపోతాయి. బెంట్‌ ట్యూబ్‌.. మొటిమలను పోగొడుతుంది. టంగ్‌ ట్యూబ్‌.. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను రూపుమాపుతుంది. దీన్ని కళ్లు, పెదవులు, ముక్కు వంటి సున్నితమైన ప్రదేశాల్లోనూ ఉపయోగించాలి. ఇక కూంబ్‌ ట్యూబ్‌.. తలలోని రక్తప్రసరణ బాగా జరిపి, కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది. ట్యూబ్స్‌ అన్నింటినీ భద్రంగా పెట్టుకోవడానికి ప్రత్యేకమైన బాక్స్‌ ఉంటుంది. దీనికి చార్జింగ్‌ పెట్టుకోవడం, తలకి లేదా ముఖానికి థెరపీ అందించడం చాలా తేలిక.

చదవండి: క్రైమ్‌ స్టోరీ: ది స్పై కెమెరా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top