Cold Turkey Idiom: కోల్డ్‌ టర్కీ.. ఈ జాతీయం అర్థం తెలుసా? ఎప్పుడు వాడతారంటే!

Do You Know Meaning Of Cold Turkey Idiom When To Use - Sakshi

కోల్డ్‌ టర్కీ

ఏదైనా చెడు అలవాటును మానేసే సందర్భంలో ‘కోల్డ్‌ టర్కీ’ అనే ఇడియమ్‌ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా మద్యం, ధూమపానం... మొదలైన అలవాట్ల విషయంలో దీన్ని వాడతారు. ఈ ఎక్స్‌ప్రెషన్‌ మొదట బ్రిటిష్‌ కొలంబియా న్యూస్‌పేపర్‌ ‘ది డైలీ కాలనిస్ట్‌’లో 1921 ఎడిషన్‌లో కనిపించింది. ఈ ఇడియమ్‌ ఎలా వచ్చింది? అనే విషయంలో రకరకాల వెర్షన్‌లు ఉన్నాయి.

అందులో ముఖ్యమైనవి... వ్యసనపరులు తమ చెడు అలవాటును మానుకోవడానికి వైద్యుల దగ్గరికి వస్తే వారికి ‘కోల్డ్‌ టర్కీ’ పేరుతో ఒక రకమైన చికిత్స చేసేవారట. దీని నుంచే వచ్చింది అనేది ఒకటి.

‘కోల్డ్‌ టర్కీ’ అనే వంటకం నుంచి వచ్చింది అనేది మరొకటి. ఈ వంటకాన్ని అప్పటికప్పుడు చేయవచ్చునట. ‘తక్కువ టైంలో’ అనే అర్థంలో ఇది వాడకంలోకి వచ్చిందనే వెర్షన్‌ ఉంది.

టాక్‌ టర్కీ లేదా టాక్‌ కోల్డ్‌ (ఏదైనా విషయాన్ని సూటిగా, నిజాయితీగా చెప్పడం) అనే ఎక్స్‌ప్రెషన్‌ల నుంచి కోల్డ్‌ టర్కీ పుట్టిందనేది ఒక వాదన. 

చదవండి: పెరుగు మంచిదే కానీ..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top