ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్‌ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?

do you know dangerous to take antibiotics without a prescription - Sakshi

అడ్డగోలు వాడకంతో అనర్థమే

జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా యాంటీబయాటిక్స్  తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది.    కానీ వైద్యుల సలహా లేకుండా,   ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రమాదకరమని మీకు తెలుసా? 564 మందిపై 2023లో నిర్వహించిన  సర్వేలో 43.6శాతం మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్‌  ఉపయోగించారట.

యాంటీబయాటిక్స్‌ అవసరం లేకుండా వాడినా, అదేపనిగా వాడినా అనర్థాలు తప్పవని డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ప్రపంచ పది ఆరోగ్య సంక్షోభ అంశాల్లో యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) మొదటి పదిలో ఒకటిగా ఉన్నట్టు పేర్కొంది. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తోనే యాంటీబయాటిక్స్‌  కొనుగోలు చేయాలి  అంటున్నారు  డీఏసీ.

ఏఎంఆర్‌ అంటే యాంటీ బయోటిక్స్‌ను అతిగా వాడడం వల్ల ఆ మందు వైరస్‌పై పనిచేయకుండా పోయే పరిస్థితి అని తెలిపింది. యాంటీ బయోటిక్స్‌ను ప్రజలు అవగాహన లేకుండా వాడటంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. యాంటీబయోటిక్స్‌ వాడకం అనర్థాలపై అవగాహన పెంచాలని సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 12.7 లక్షల మంది బ్యాక్టీరియల్‌ యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ కారణంగా మృతి చెందినట్టు తెలిపారు.

యాంటీబయాటిక్స్‌ అతిగా వాడడం వల్ల బ్యాక్టీరియా రెసిస్టెంట్‌గా మారుతుందని, ఇది సూపర్‌బగ్‌ మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు డాక్టర్‌ సూచన మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్‌ వినియోగించాలన్నారు. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా యాంటీబయాటిక్స్‌ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top