
వర్క్ కల్చర్‌పై ‘ఇన్ఫోసిస్’ కో–ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్ ‘70 హవర్స్ ఏ వీక్’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల కోణాలలో ఈ కామెంట్ గురించి చర్చోపచర్చల మాట ఎలా ఉన్నా స్టాండప్ కమెడియన్‌లు, మీమ్స్ సృష్టించే వాళ్లకు మాత్రం చేతినిండా పని దొరికింది. స్టాండప్ కమెడియన్ వివేక్ మురళీధరన్ వీడియోలో...
‘ఇప్పుడు మనం 70 హవర్స్ ఏ వీక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సెల్‌ఫోన్‌లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ‘వారానికి 70 గంటలు పని చేయాలంటే’ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతాడు.
రోజుకు, వారానికి, నెలకు ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుందో చెబుతాడు. టోటల్‌గా చెప్పాలంటే సంవత్సరంలో మనకంటూ మిగిలేది రెండు నెలలే. అందుకే తరచుగా ఈ సంవత్సరం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అంటుంటాం’ అని వివేక్ అన్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా నవ్వారు. ఒకరు ‘పోకిరి’ సినిమా ‘ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా’ డైలాగుతో మీమ్ చేశారు... ‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదన్నయ్యా,,,, అసలు పనిచేశామా లేదా అన్నది పాయింట్’.