జస్ట్‌ మూడు సెకన్ల వీడియోలతో... కోట్ల పంట!

China Woman Earns Rs 120 Cr Per Week By 3 Second Product Review - Sakshi

సోషల్‌ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఓవర్‌నైట్‌ స్టార్‌లుగా ఎదిగిపోతున్నారు. డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు. వాళ్లలో దాగి ఉన్న ఏదో ఒక స్కిల్‌తో ఇన్‌స్టా, టిక్‌టాక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో వీడియోలు అప్‌లోడ్‌ చేసి ఫేమస్‌ అయిపోతున్నారు. కొద్ది వ్యవధిలోనే కోట్లలో డబ్బులు గడిస్తూ..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పైగా వీరిని సోషల్‌మీడియా పరిభాషలో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా పిలుస్తున్నారు. ఇక్కడ ఈ మహిళ కూడా అలాంటి కోవకు చెందింది. జస్ట్‌ మూడు నిమిషాల నిడివగల వీడియోలతో ఫేమస్‌ అవ్వడమే గాకుండా ఏకంగా వారానికే కోట్లు గడిస్తోంది. 

వివరాల్లోకెళ్తే..జపాన్‌కి చెందిన  జెంగ్ జియాంగ్ యువతి సరదాకి సోషల్ మీడియాను వాడటం ప్రారంభించింది. ఆ ఇష్టంతోనే డిఫరెంట్‌.. డిఫరెంట్‌గా.. వీడియోలు టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసేది. అయితే ఆ వీడియోలు చాలా విభిన్నంగా ఉండటమే కాకుండా ఆకట్టుకునే రీతీలో ఉండటంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది. ఆమె వీడియోల్లోని కొత్తదనం నచ్చి లక్షల కొద్ది ప్రజలు ఆమెను అనుసరించడం ప్రారంభించారు. దీంతో వివిధ రకాల కంపెనీలు ఆమెతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చాయి. ఫలితంగా ఆమె తన వీడియోల్లో ఆ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది.. ఇలా ఆమె వారానికి 120 కోట్లు సంపాదిస్తోంది. అంతేగాదు ఈ టిక్ టాక్ యాప్ లో ఆమెకు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అయితే జియాంగ్‌ ఇతర సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయోన్సర్‌ల మాదిరిగా కాకుండా ప్రమోట్‌ చేస్తున్న ఉత్పత్తుల వివిరాలను నిశితం వివరించడంలో ఆమె నేర్పు అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలు జస్ట్‌ మూడు సెకన్లలో అర్థమయ్యేలా వేగవంతంగా చెప్పే వే ఆఫ్‌ స్టయిల్‌కి ఫిదా అయిపోతున్నామని చాలామంది చెబుతుండటం విశేషం. అందువల్లే ఆమెతో వ్యాపార సంబంధ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని చైనా వ్యాపారులు చెబుతున్నారు.

అలాగే ఆమె తమ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వల్ల అమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయని చైనా వ్యాపారులు చెబుతున్నారు. ఈ స్థాయిలో ఆర్జిస్తున్నప్పటికీ జెంగ్ జియాంగ్ ఇసుమంత అహం ప్రదర్శించదు. అందువల్లే జియాంగ్‌కు రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. కేవలం వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రకటనలు మాత్రమే కాకుండా.. సామాజిక, ధార్మిక సంస్థలకు సంబంధించిన ప్రకటనలను జెంగ్ జియాంగ్ చేస్తోంది. అయితే అలాంటి వాటికి డబ్బులు తీసుకోదు. పైగా తనవంతుగా సాయం కూడా చేస్తుందట.

(చదవండి: ప్రేమికుల రోజుని జైల్లో సెలబ్రేట్‌ చేసుకోవడం గురించి విన్నారా? అదికూడా ఖైదీలు..)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top