పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..! | Cat Museum In Kuching, Sarawak, Malaysia | Sakshi
Sakshi News home page

పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!

Apr 14 2024 3:26 PM | Updated on Apr 14 2024 3:42 PM

Cat Museum In Kuching Sarawak Malaysia - Sakshi

ఎన్నో రకాల మ్యూజియంలు చూసుంటారు. ఇలా పిల్లుల కోసం ప్రత్యేకంగా ఉన్న మ్యూజియంని ఇంత వరకు చూసి ఉండరు. మన దేశంలో పిల్లిని పొద్దునే చూడటం అపశకునంగా భావిస్తారు గానీ పాశ్చాత్యులు పెంపుడు జంతువుగా పిల్లిని పెంచుకుంటారు. వాళ్లు ఏకంగా ఈ పిల్లుల కోసం ప్రత్యకంగా మ్యూజియంని ఏర్పాటు చేశారు. మరింత విశేషమేమిటంటే ఆ వ్యూజియంలో పిల్లి మమ్మీలు కూడా ఉంటాయట. ఇంతకీ ఆ మ్యూజియం ఎక్కడ ఉందంటే..

ప్రపంచంలో వింత వింత మ్యూజియంలు ఎన్నో ఉన్నాయి. మలేసియాలోని ఈ పిల్లుల మ్యూజియం కూడా అలాంటిదే! మలేసియాలోని కుచింగ్‌ నగరంలో ఉందిది. కుచింగ్‌ నార్త్‌ సిటీ హాల్‌ యాజమాన్యంలో దీనిని 1993లో నెలకొల్పారు. ఈ పిల్లుల మ్యూజియంలో పిల్లులకు సంబంధించిన దాదాపు నాలుగువేలకు పైగా కళాఖండాలు, వస్తువులు కొలువుదీరి మార్జాలాభిమానులకు కనువిందు చేస్తాయి.

ఇందులో పిల్లులకు చెందిన పెయింటింగ్స్, శిల్పాలు, ఈజిప్టు నుంచి తీసుకువచ్చిన ప్రాచీన మార్జాల మమ్మీ వంటి అరుదైన వస్తువులు, పిల్లులకు సంబంధించిన ప్రకటనలు, అరుదైన జాతుల పిల్లుల చిత్రపటాలు, ఫొటోలు వంటివి అబ్బురపరుస్తాయి. ఈ పిల్లుల కళాఖండాలను తొలిసారిగా 1988లో మలేసియా ఉన్నతాధికారి దివాన్‌ తున్‌ అబ్దుల్‌ రజాక్‌ ‘పుత్ర వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌’లో ప్రదర్శించారు. తర్వాత కుచింగ్‌ నార్త్‌ సిటీ హాల్‌ యాజమాన్యం వీటిని సొంతం చేసుకుని, నార్త్‌ సిటీ హాల్‌ దిగువ అంతస్తులో శాశ్వతంగా ఈ పిల్లుల మ్యూజియంను ఏర్పాటు చేసింది. 

(చదవండి: సీతాకోక చిలుక పాలు గురిచి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement