భయపెట్టే బెల్స్‌పాల్సీ.. కారణం ఏంటో తెలుసా?

Bells Palsy Causes And Symptoms - Sakshi

బెల్స్‌పాల్సీ చాలా మందిలో కనిపించే సాధారణ  జబ్బే. కానీ ముఖంలో పక్షవాతంలా రావడంతో చాలా ఆందోళనకు గురిచేస్తుంది. దీన్ని ‘ఫేషియల్‌ పెరాలసిస్‌’ అని కూడా అంటారు. సాధారణంగా ఇది కొద్దిపాటి చికిత్సతో తగ్గిపోతుంది. 

కారణం: మెదడునుంచి బయల్దేరి వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఇందులో ఏడో నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. హెర్పిస్‌ సింప్లెక్స్‌ లేదా అలాంటి ఇతర ఏవైనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చాక, దేహంలో ఉత్పన్నమైన యాంటీబాడీస్‌ ఫేషియల్‌ నర్వ్‌ను దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వస్తుంది. దానితో అనుసంధానమై ఉన్న ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి. 

లక్షణాలు: మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే పుక్కిలించగలగడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ / చికిత్స : బెల్స్‌ పాల్సీ నిర్ధారణ కోసం మిథైల్‌ ప్రెడ్నిసలోన్‌ అనే మందును 500 ఎంజీ మోతాదులో రోజుకు రెండుసార్లు చొప్పున గాని లేదా 1 గ్రామును రోజుకు ఒకసారిగాని... మూడు రోజులు ఇవ్వాలి. ఆ తర్వాత 10వ రోజు నుంచి మెరుగుదల కనిపిస్తుంటుంది. పూర్తిగా కోలుకునేందుకు ఒక నెల రోజులు పట్టవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top